సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని సమావేశం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాతలు..

తెలుగు చిత్రపరిశ్రమను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.. నిన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్‏ ఈవెంట్‏లో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో కఠినమైన సందర్భాల్లో

సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని సమావేశం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాతలు..
C Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2021 | 4:59 PM

తెలుగు చిత్రపరిశ్రమను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.. నిన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్‏ ఈవెంట్‏లో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో కఠినమైన సందర్భాల్లో ముందుగా సినీ పరిశ్రమను స్పందిస్తుంది… కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ తీవ్రమైన విపత్తు ఎదుర్కోంటుంది.. ఏపీ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీని కనికరించాలని విజ్ఞప్తి చేసారు చిరంజీవి. దీంతో ఈరోజు (సెప్టెంబర్ 20న) ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లతో ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్‌ రాజు, డీఎన్‌వీ ప్రసాద్‌, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఇందులో ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.

అనంతరం .. నిర్మాత సీ. కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించిందన్నారు. అలాగే.. ఆన్‏లైన్ టిక్కెటింగ్ కావాలని కూడా మేమే అడిగామని చెప్పుకోచ్చారు కళ్యాణ్.. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉందని.. సినిమా ఇండస్ట్రీకి ఊతమిచ్చారన్నారు. ఇక ఆ తర్వాత నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ఆన్‏లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేదని.. ఇప్పుడు దానిని తప్పనిసరి మేమే కోరామని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఆదిశేషగిరిరావు.

ఇక ప్రముఖ నిర్మాత డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో సమావేశం జరగడం తొలిసారి. విభజన తర్వాత సినిమా వాళ్లతో ఈ తరహా సమావేశం ఇప్పుడే జరిగింది. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని తెలిపారు.. ప్రస్తుతం బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారని.. టిక్కెట్ల ధరల పెంపుపై చర్చే జరగలేదని. థియేటర్ల మెయింటనెన్స్ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు నిర్మాత డీఎన్వీ ప్రసాద్.

Also Read: Online Cinema Tickets: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు.. చర్చల అనంతరం మంత్రి కీలక ప్రకటన