AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?

Samantha: గత కొద్ది రోజులుగా నటి సమంత వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. సమంత సోషల్‌ మీడియాలో 'అక్కినేని' పేరును తొలగించి 'ఎస్‌' అని మార్చుకున్న..

Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?
Narender Vaitla
|

Updated on: Sep 20, 2021 | 10:53 PM

Share

Samantha: గత కొద్ది రోజులుగా నటి సమంత వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. సమంత సోషల్‌ మీడియాలో ‘అక్కినేని’ పేరును తొలగించి ‘ఎస్‌’ అని మార్చుకున్న రోజు నుంచి ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. సమంత, నాగచైతన్యల మధ్య ఏదో గొడవ జరుగుతుందని, త్వరలోనే ఈ జంట విడిపోనున్నారని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సమంత చేస్తోన్న కొన్ని పనులు కూడా దీనికి ఆజ్యం పోసినట్లు అనిపించింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అక్కినేని కుటుంబ వేడుకల్లో సామ్‌ కనిపించకపోవడం, నాగచైతన్యతో కలిసి కనిపించకపోవడం ఈ పుకార్లకు బలం చేకూర్చాయి. ఇక తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఓ మీడియా ప్రతినిధి.. ‘మీపై పుకార్లు వస్తున్నాయి ఏమంటారు?’ అని ప్రశ్నించగా.. ‘గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బుద్ధి లేదా?’ అని సామ్‌ ఘాటుగా స్పందించడంతో ఈ చర్చ మరింత పెరిగింది.

అయితే తాజాగా సమంత ట్విట్టర్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్‌ సామ్‌,చైల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇదంతా వట్టి పుకార్లే అన్న వాదనకు మరోసారి బలం చేకూర్చినట్లు అయ్యింది. ఇంతకీ సామ్‌ చేసిన ట్వీట్ ఏంటంటే.. సెప్టెంబర్‌ 20 అక్కినే నాగేశ్వర్‌ రావు జన్మదినం. ఈ సందర్భంగా నాగార్జున బంగార్రాజు సినిమాకు సంబంధించిన గెటప్‌లో ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఇందులో నాగేశ్వర రావు ఉపయోగించిన పంచె, వాచ్‌ను ధరించి అచ్చంగా ఏఎన్‌ఆర్‌లా తయారయ్యారు. ‘ఏఎన్‌ఆర్‌ లివ్స్‌ ఆన్‌’ అంటూ పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఇదే వీడియోను రీ ట్వీట్ చేసిన సమంత.. ‘ఇది చాలా అద్భుతంగా ఉంది నాగార్జున మామ’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. దీంతో సామ్‌ అక్కినేని కుటుంబానికి దూరమవుతుందని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పిందని ఆమె ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చర్చ ఈ ట్వీట్‌తో ఆగిపోతుందా.? లేదా ఇంకా కొనసాగుతుందా చూడాలి.

సమంత చేసిన ట్వీట్..

Also Read: Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..