Krithi Shetty Birthday : పండువెన్నెల పరువాలతో.. ఓరకంటి చూపులతో కవ్విస్తున్న కృతి
ఉప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి
Updated on: Sep 21, 2021 | 12:56 PM

ఉప్పెన ఫేమ్ క్రిటిశెట్టి ఫైనల్‌గా ఉట్టి కొట్టేశారు. వైష్ణవ్‌తేజ్ చెయ్యి పట్టుకుని... గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడమ్మాయిని... నెత్తినపెట్టుకుని చూసుకుంటోంది టాలీవుడ్ పరిశ్రమ.

నేడు ఈ మంగుళూరు ముద్దుగుమ్మ పుట్టిన రోజు

అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇక ఉప్పెన సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ కృతి.

ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ గోల్డెన్ లెగ్ కిట్టీలో ఫైవ్ బిగ్ మూవీస్ వున్నాయి. నానీతో శ్యామ్‌సింగరాయ్, అక్కినేని కాంపౌండ్‌లో చైతూతో చేస్తున్న బంగార్రాజు, ఇంద్రగంటి మోహన్‌క్రిష్ణ డైరెక్షన్లో సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో లింగుసామి డైరెక్షన్‌లో మల్టిలింగువల్ మూవీ చేస్తున్నారు.

వెరీ రీసెంట్ గా స్టార్ట్ అయిన పొలిటికల్ థ్రిల్లర్... 'మాచర్ల నియోజకవర్గం'. రష్మిక, కీర్తి సురేష్ లాంటి టాప్ బ్రాస్ హీరోయిన్స్ తో సినిమాలు చేసే నితిన్... సడన్ గా ఈ 'మాచర్ల' కోసం క్రితి శెట్టి చెయ్యి పట్టుకున్నారు.


ఇవ్వన్నీ ఒక ఎత్తయితే... ఐకాన్ స్టార్ గుడ్ లుక్స్ లో కూడా ఉన్నారట క్రితి శెట్టి. బన్నీ హీరోగా దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఐకాన్ మూవీలో క్రితి శెట్టి సెకండ్ ఫిమేల్ లీడ్ కి కన్సిడరేషన్లో వున్నారు.




