AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నెలకు 30 వేలు అయితే జాబ్‌ చెయ్యా.. ఏడాదికి మూడు లక్షలైతేనే చేస్తా’.. నవ్వులు పూయిస్తోన్న జాతిరత్నాలు డిలీటెడ్‌ వీడియో..

Jathi Ratnalu Deleted Scene: నవీన్‌ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన ప్రాతదారులుగా తెరకెక్కిన 'జాతి రత్నాలు' ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా వచ్చిన..

'నెలకు 30 వేలు అయితే జాబ్‌ చెయ్యా.. ఏడాదికి మూడు లక్షలైతేనే చేస్తా'.. నవ్వులు పూయిస్తోన్న జాతిరత్నాలు డిలీటెడ్‌ వీడియో..
Jathi Rathnalu
Narender Vaitla
|

Updated on: Apr 03, 2021 | 9:55 PM

Share

Jathi Ratnalu Deleted Scene: నవీన్‌ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన ప్రాతదారులుగా తెరకెక్కిన ‘జాతి రత్నాలు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. సరికొత్త కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక జాతి రత్నాల హవా దేశానికి పరిమితం కాలేదు అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. పల్లె నుంచి పట్నం వచ్చిన ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో పండిన కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అనుదీప్‌ దర్శకత్వ పనితీరు, డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. సినిమా నిడివి కారణంగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్‌లో భాగంగా తొలగించారు. అయితే తాజాగా ఆ సన్నివేశాలను మళ్లీ ప్రేక్షకుల కోసం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ‘ఈ సీన్లు ఎందుకు డిలీట్‌ చేశారయ్యా.?’ అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఉన్న కామెడీ సీన్లను చూస్తుంటే నిజంగానే ఎందుకు తొలిగించారనే భావన కలగక మానదు. అంతలా ఆకట్టుకుంటున్నాయు సీన్లు. నవీన్‌ పొలిశెట్టి చెప్పే.. ‘నేను నెలకు రూ.30 వేలు జీతం వచ్చే ఉద్యోగమయితే చెయ్యా.. ఏడాదికి మూడు లక్షలైతేనే చేస్తా’ అనే డైలాగ్‌ వీడియోకు హైలెట్‌గా నిలిచింది. మరి సినిమాలో లేని ఈ కామెడీ సన్నివేశాలపై మీరూ ఓ లుక్కేయండి..

జాతిరత్నాలు డిలీటెడ్‌ వీడియో..

Also Read: Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ 5 స్టార్ట్ అయ్యేది అప్పుడే..! కంటెస్టెంట్లు వీరేనా..?

Nivetha Thomas: సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. ‘వకీల్ సాబ్’ హీరోయిన్‌కు కోవిడ్ పాజిటివ్.!

Prabhu Deva: డ్యాన్స్‌లకు రారాజు.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకు బర్త్ డే విషెస్..