AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Twitter: చిరు ట్విట్టర్‌ అకౌంట్‌కు ఏమైంది.. ఫాలోయింగ్ జాబితా జీరో ఎందుకు అయ్యింది..?

Chiranjeevi Twitter: లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానంటూ మెగాస్టార్‌ చిరంజీవి ఆలస్యంగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చినా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తన వ్యక్తిగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన వివరాలను...

Chiranjeevi Twitter: చిరు ట్విట్టర్‌ అకౌంట్‌కు ఏమైంది.. ఫాలోయింగ్ జాబితా జీరో ఎందుకు అయ్యింది..?
Chiru
Narender Vaitla
|

Updated on: Apr 03, 2021 | 9:29 PM

Share

Chiranjeevi Twitter: లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానంటూ మెగాస్టార్‌ చిరంజీవి ఆలస్యంగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చినా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తన వ్యక్తిగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు మెగాస్టార్‌. అయితే చిరును ట్విట్టర్‌లో దాదాపు లక్ష మంది ఫాలో అవుతుండగా అతను మాత్రం కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నాడని నిన్నటి నిన్న వార్త వచ్చిన విషయం తెలిసిందే.

Chiru Tweet

Chiru Tweet

అయితే తాజాగా ఏమైందో ఏమో తెలియదు కానీ చిరు ఫాలో అయ్యే వారి జాబితా ఒకటి నుంచి సున్నాకు చేరుకుంది. దీంతో ప్రస్తుతం అంతా ఆలోచనలో పడ్డారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు చిరు ట్విట్టర్‌ ఖాతాను తానే చూసుకుంటున్నాడా.. లేదా మరెవరైనా హ్యాండిల్‌ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా చిరు ట్విటర్‌ ఫాలోయింగ్‌ లిస్టులో రామజోగయ్య శాస్త్రి పేరు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. ఓ నెటిజన్‌ చిరు ఫాలోయింగ్ జాబితాకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌ తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు రామజోగయ్య శాస్త్రి కూడా స్పందిస్తూ.. ‘ఎప్పటికి రుణపడి ఉంటాను, కొండంత సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ కూడా చేశాడు. అయితే ఒక్కసారిగా మళ్లీ ఫాలోవర్ల సంఖ్య జీరోకు చేరడంతో అందరిలోనూ చర్చ మొదలైంది.

Also Read: ట్విట్టర్‌లో చిరును లక్ష మంది ఫాలో అవుతోన్నా.. ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరా ఒక్కరు.?

Raashi Khanna Dance Enjoy Enjaami: అందాల రాశీ అద్భుత డ్యాన్స్‌.. స్టెప్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. ఏప్రిల్ 5న…