Raashi Khanna Dance Enjoy Enjaami: అందాల రాశీ అద్భుత డ్యాన్స్‌.. స్టెప్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna Dance Enjoy Enjaami: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి కొన్ని రకాల పాటలు, డ్యాన్స్‌లు నెట్టింట్లో వైరల్‌గా మారతున్నాయి. మరీ ముఖ్యంగా సినీ తారలు ఈ పాటలకు కాలు కదపడం, ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో...

Raashi Khanna Dance Enjoy Enjaami: అందాల రాశీ అద్భుత డ్యాన్స్‌.. స్టెప్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Raashi Khanna
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 03, 2021 | 7:40 PM

Raashi Khanna Dance Enjoy Enjaami: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి కొన్ని రకాల పాటలు, డ్యాన్స్‌లు నెట్టింట్లో వైరల్‌గా మారతున్నాయి. మరీ ముఖ్యంగా సినీ తారలు ఈ పాటలకు కాలు కదపడం, ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి వీడియోలు రోజుకోటి నెట్టింట్లో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ‘ఎంజాయ్‌ ఎంజమ్మి’ అంటూ సాగే ఈ తమిళ్‌ సాంగ్‌ ప్రస్తుతం నెట్టింట్లో ఓ సంచలనంగా మారింది. సినీ తారలు ఈ పాటకు కాళు కదుపుతూ నెట్టింట్లో వీడియోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార రాశీ ఖన్నా కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాశీ ఖన్నా ఈ పాటకు వేసిన స్టెప్పులు, హోయలు ఆమె అభిమానులను ఫుల్‌ ఫిదా చేస్తున్నాయి. మరి రాశీ ఖన్నా మెస్మరైజ్‌ స్టెప్‌లపై మీరూ ఓ లుక్కేయండి. ఇక ఇదే పాటకు గతంలో మరో నటి నజ్రియా నజీమ్‌ కూడా తన సోదరుడితో కలిసి స్టెప్పులేసింది. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

రాశీ ఖన్నా చేసిన పోస్ట్..

నజ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

అసలేంటీ పాట..

‘ఎంజాయ్‌ ఎంజమ్మి’ అంటూ వైవిధ్యమైన లిరిక్స్‌, వీడియోతో తెరకెక్కిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సంతోష్‌ నారాయణ్‌ కంపోజ్‌ చేసిన పాటను ఢీ, ఆరివు (రాపర్‌) ఆలపించారు. ఇక ఈ పాట ఓ ప్రైవేటు ఆల్బమ్‌కు సంబంధించింది కావడం విశేషం. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఈ పాట అందరి మదిని దోచుకుంటోంది. ఈ పాటను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఏకంగా 9 కోట్లకుపైగా మంది వీక్షించడం విశేషం. మరి ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న ఈ పాటను మీరూ ఓసారి చూసేయండి.

Also Read: చైన్‌ స్నాచింగ్‌కి పాల్పడుతున్న సీరియల్స్‌ నటుడు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు బుక్.. వెలుగులోకి వచ్చిన బెట్టింగ్‌ ఎవ్వారం..

సినిమాల్లోకి అడుగు పెట్టిన వీరప్పన్ కూతురు.. తండ్రి స్టైల్ లో గన్ పట్టుకొని ఫోజ్ ఇచ్చిన విజయలక్ష్మీ

Kangana Ranaut -Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్.. కంగనా ను క్వీన్ అంటూ పొగిడిన సమంత..