AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లోకి అడుగు పెట్టిన వీరప్పన్ కూతురు.. తండ్రి స్టైల్ లో గన్ పట్టుకొని ఫోజ్ ఇచ్చిన విజయలక్ష్మీ

వీరప్పన్ ఈ పేరు చెప్తే ఒకానొక సమయంలో దేశం మొత్తం ఉలిక్కిపడేది. గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరుగాంచిన వీరప్పన్ ను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. అయితే వీరప్పన్‌ కుమార్తె విద్యా రాణి బీజేపీలో చేరారు.

సినిమాల్లోకి అడుగు పెట్టిన వీరప్పన్ కూతురు.. తండ్రి స్టైల్ లో గన్ పట్టుకొని ఫోజ్ ఇచ్చిన విజయలక్ష్మీ
Vijayalakshmi
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2021 | 12:27 PM

Share

వీరప్పన్ ఈ పేరు చెప్తే ఒకానొక సమయంలో దేశం మొత్తం ఉలిక్కిపడేది. గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరుగాంచిన వీరప్పన్ ను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. అయితే వీరప్పన్‌ కుమార్తె విద్యా రాణి బీజేపీలో చేరారు. ఇప్పుడు వీరప్పన్ రెండో కుమార్తె విజయలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. విజయ లక్ష్మీ ప్రధానపాత్రలో కోలీవుడ్ లో సినిమా తెరకెక్కుతుంది. ఇందుకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను కేఎన్‌ఆర్‌ రాజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మావీరన్‌ పిళ్లై’ అనే పేరుతో సినిమా తెరకెక్కనుంది.

ఈ పోస్టర్ లో విజయలక్ష్మీ వీరప్పన్ స్టైల్ లో గన్ పట్టుకొని నిలుచున్నారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. రవివర్మ సంగీతం, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.  గతంలోనూ వీరప్పన్ పైన పలు సినిమాలు వచ్చాయి. వీర‌ప్ప‌న్ః హంగ‌ర్ ఫ‌ర్ కిల్లింగ్  అనే సినిమా పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. వీర‌ప్ప‌న్ భార్య వి.ముత్తుల‌క్ష్మి ఆ సినిమా పై  కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. దీని ప్ర‌భావం త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ప‌డుతుంద‌ని ఆమె ఆ అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. గ‌తంలో చాలా మంది డ‌బ్బుల కోసం వీరప్ప‌న్‌పై సినిమాల‌ను తీసి త‌మ ప‌రువు, మ‌ర్యాద‌కు ఇబ్బంది క‌లిగించార‌ని ఆమె అందులో వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన  కూతురు విజయలక్ష్మీ సినిమారంగంలోకి అడుగుపెట్టడం అదికూడా స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేయడం టాపిక్ అయ్యింది. ఆమె సినిమాల్లో ఈమేరకు రాణిస్తారో చూడాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut -Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్.. కంగనా ను క్వీన్ అంటూ పొగిడిన సమంత..

Pushpa Movie : ‘పుష్ప’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు