Pushpa Movie : ‘పుష్ప’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Pushpa Movie : 'పుష్ప'నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు
Pushpa
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 03, 2021 | 11:08 AM

PRELUDE OF PUSHPARAJ: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో తొలిసారి కన్నడ బ్యూటీ రష్మిక బన్నీ సరసన నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్‌ పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న బన్నీ ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో బన్నీ తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు.

అయితే ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న అల్లుఅర్జున్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు భారీ సర్‌ప్రైజ్  ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీమ్. ఏ నేపథ్యంలో ఈ వారామంతా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ‘పుష్ప’ మేకర్స్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండమని ట్వీట్ చేసారు. అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ పాన్ ఇండియన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna: రష్మిక అదృష్టం మాములుగా లేదుగా ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్..

‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి…!! ఏమని కామెంట్ చేశారో తెలుసా..? ( వీడియో )

జోరు పెంచిన మెగాహీరో.. మూడో సినిమాను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.. క్లాప్ కొట్టిన సాయి ధరమ్ తేజ్