Rashmika Mandanna: రష్మిక అదృష్టం మాములుగా లేదుగా ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్..

ఛలో సినిమాతో తెలుగుబి ప్రేక్షకులను పలకరించింది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమా తోనే సాలిడ్ సక్సెస్ అందుకోవడమే కాకుండా కుర్రాళ్ళ కాళరాకుమారిగా మారిపోయింది రష్మిక. ఛలో సినిమా తర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో

Rashmika Mandanna: రష్మిక అదృష్టం మాములుగా లేదుగా ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్..
ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తుంది. పుష్పలో గిరిజన యువతిగా కనిపించనుంది రష్మిక. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 03, 2021 | 10:20 AM

Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగుబి ప్రేక్షకులను పలకరించింది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమా తోనే సాలిడ్ సక్సెస్ అందుకోవడమే కాకుండా కుర్రాళ్ళ కాళరాకుమారిగా మారిపోయింది రష్మిక. ఛలో సినిమా తర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత రశ్మికకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. అటు కన్నడ సినిమాలు చేస్తూనే ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇప్పడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగు, కన్నడతోపాటు కోలీవుడ్ బాలీవుడ్ పైన కూడా కన్నేసింది. ఇప్పటికే తమిళ్ లో కార్తి సరసన సుల్తాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తెలుగు రెండు భాషల్లో విడుదలైన సుల్తాన్ మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరోవైపు రష్మిక బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే ‘టాప్ టక్కర్’ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో  హిందీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ లక్కీబ్యూటీ. ఈ చిత్రానికి వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి గుడ్ఈ బై అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అయితే నేడు (ఏప్రిల్ 4న )రష్మిక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ నటిస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో రష్మిక నటిస్తుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

జోరు పెంచిన మెగాహీరో.. మూడో సినిమాను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.. క్లాప్ కొట్టిన సాయి ధరమ్ తేజ్

Nagarjuna Akkineni : నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పట్టాలెక్కేది ఇంకెప్పటికో ఎప్పటికో..

Sandeep Raj: స్టార్ హీరోకోసం కథను సిద్ధం చేసిన కలర్ ఫోటో డైరెక్టర్.. ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!