- Telugu News Photo Gallery Cinema photos Mega hero vaishnav tej new movie has launched pooja ceremony
జోరు పెంచిన మెగాహీరో.. మూడో సినిమాను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.. క్లాప్ కొట్టిన సాయి ధరమ్ తేజ్
మెగా ఫ్యామిలీనుంచి ఉప్పెన దూసుకువచ్చిన హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా స్టార్ మేనల్లుడిగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వైష్ణవ్ తేజ్
Updated on: Apr 03, 2021 | 9:30 AM

మెగా ఫ్యామిలీనుంచి ఉప్పెన దూసుకువచ్చిన హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా స్టార్ మేనల్లుడిగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమా తో సంచలన విజయం సాధించడమే కాకుండా మంచి క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు వైష్ణవ్.

డెబ్యూ సినిమాతోనే రికార్డులను తిరగరాశారు వైష్ణవ్ తేజ్. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది.

అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో సినిమా చేస్తున్నాడు ఈ మెగా హీరో.

శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సినిమాలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' నటిస్తుంది.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.




