Sandeep Raj: స్టార్ హీరోకోసం కథను సిద్ధం చేసిన కలర్ ఫోటో డైరెక్టర్.. ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా..

కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. పలు షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించిన సందీప్ రాజ్ ఆతర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో పాటు పలు హిట్ సినిమాలకు రచన

Sandeep Raj: స్టార్ హీరోకోసం కథను సిద్ధం చేసిన కలర్ ఫోటో డైరెక్టర్.. ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా..
Sandeep Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 03, 2021 | 7:57 AM

Sandeep Raj: కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. పలు షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించిన సందీప్ రాజ్ ఆతర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో పాటు పలు హిట్ సినిమాలకు రచన – దర్శకత్వ విభాగంలో వర్క్ చేసాడు. ఆతర్వాత దర్శకుడిగా మారి సుహాస్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా కలర్ ఫోటో అనే సినిమా చేసాడు సందీప్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. మంచి లవ్ స్టోరీ తో పాటు చక్కని ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు సందీప్ రాజ్. దాంతో ఇప్పుడు ఈ కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో సందీప్ తన నెక్స్ట్ సినిమాని ఓ స్టార్ హీరోతో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సందీప్ తో సినిమా చేయాలనీ సిద్ధంగా ఉన్నారట అటు సందీప్ కూడా  స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. అయితే ఆ కథతో ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయాలనీ చూస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికి ఈ విషయం పై క్లారిటీ రానప్పటికీ గీతా ఆర్ట్స్ తో సందీప్ సీనియమా త్వరలో ఉంటుందని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపున ‘ఆకాశవాణి’ అనే సినిమాకు రచన – డైలాగ్స్ రాస్తున్నాడు సందీప్. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ కుర్ర డైరెక్టర్ ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love Story Movie: మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగచైతన- సాయిపల్లవి లవ్ స్టోరీ

Anasuya Bharadwaj : మీకు పెళ్లింది అయ్యింది కదా అందుకే ప్రపోజ్ చేయలేదు.. అనసూయ వీడియోపై నెటిజన్ల కొంటె కామెంట్లు..

అందాల బుట్టబొమ్మకు ఆఫర్ల వెల్లువ.. మూడు భాషల్లో రాణించాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..