చైన్‌ స్నాచింగ్‌కి పాల్పడుతున్న సీరియల్స్‌ నటుడు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు బుక్.. వెలుగులోకి వచ్చిన బెట్టింగ్‌ ఎవ్వారం..

Chain Snatching Case : బెట్టింగులకు అలవాటు పడిన ఓ సీరియల్స్‌ నటుడు, మరొక వ్యక్తి కలిసి చైన్‌ స్నాచింగ్‌కి పాల్పడుతున్నారు. జల్సాలకు

చైన్‌ స్నాచింగ్‌కి పాల్పడుతున్న సీరియల్స్‌ నటుడు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు బుక్.. వెలుగులోకి వచ్చిన బెట్టింగ్‌ ఎవ్వారం..
Chain Snatching Case
Follow us
uppula Raju

|

Updated on: Apr 03, 2021 | 7:01 PM

Chain Snatching Case : బెట్టింగులకు అలవాటు పడిన ఓ సీరియల్స్‌ నటుడు, మరొక వ్యక్తి కలిసి చైన్‌ స్నాచింగ్‌కి పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటైన వీరిద్దరు ఈజీ మనీ కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. అమాయకులైన మహిళలను టార్గెట్‌ చేస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. రెండు రోజుల కిత్రం సూరత్‌లో రోడ్డుపై వెళ్తోన్న మహిళ మెడలో నుంచి చైన్‌ లాక్కుని వెళుతుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారి గురించి పలు విషయాలను వెల్లడించారు.

ముంబైలో ఉంటున్న నటుడు మీరజ్‌ కపాడి ఇప్పటికే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. అంతే కాదు తన స్నేహితులకు సీరియల్స్‌లో కూడా అవకాశం కల్పించాడు. అయితే ఇతడికి క్రికెట్‌ బెట్టింగ్‌ అంటే పిచ్చి. దీంతో చాలా డబ్బు పొగొట్టుకోవడమే కాక అప్పుల పాలయ్యాడు. ఇలాంటి సమయంలో ఇతడికి బిల్లర్‌ వైభవ్‌ జాదవ్‌ పరిచయమయ్యాడు. అతడు కూడా బెట్టింగ్‌ వల్ల అప్పుల పాలయ్యాడు.దీంతో ఇద్దరు కలిసి సూరత్‌లో ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.

ఇక వీరి వద్ద నుంచి పోలీసులు మూడు గొలుసులతో పాటు 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.. అరెస్టయిన నిందితుల్లో వైభవ్‌పై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. రాజ్‌కోట్, కేశోడ్, జునాగఢ్‌, అహ్మదాబాద్‌లతో సహా వెరవాల్‌ ప్రాంతాల్లో ఇతడిపై నేరాలు నమోదయ్యాయి. గత కొంతకాలగా చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రత్యేక నిఘా పెంచామని దీంతో వీరిద్దరి బాగోతం వెలుగులోకి వచ్చిందని పోలీసులు వివరించారు.

Leaders Criminal History: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నేర చరిత నాయకుల చిట్టా చాంతాడంతా.. తాజా లెక్కలు ఇవే..

మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు.. పెరుగుతున్న ప్రమాదాలు.. తాగుబోతుల్లో ఎక్కువ శాతం వారే..!

Breaking: తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన.. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా..

జూబ్లీహిల్స్ హత్యకు కారణం వివాహేతర సంబంధమేనా..? పోలీసుల అదుపులో నిందితుడు.. మృతుడి భార్య