AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leaders Criminal History: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నేర చరిత నాయకుల చిట్టా చాంతాడంతా.. తాజా లెక్కలు ఇవే..

Leaders Criminal History: ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ ప్రజల దృష్టంతా ఈ ప్రాంతాల్లో జరుగుతుతోన్న ఎన్నికలపై పడింది...

Leaders Criminal History: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నేర చరిత నాయకుల చిట్టా చాంతాడంతా.. తాజా లెక్కలు ఇవే..
Leaders With Criminal Histo
Narender Vaitla
|

Updated on: Apr 03, 2021 | 7:07 PM

Share

Leaders Criminal History: ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ ప్రజల దృష్టంతా ఈ ప్రాంతాల్లో జరుగుతుతోన్న ఎన్నికలపై పడింది. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు మినీ ఫైనల్‌గా భావిస్తోన్న ఎన్నికలు కావడంతో పార్టీలు తమ శక్తిమేర ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నేర చరితకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించింది. మూడు విడతల ఎన్నికల వరకు ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు 7,165 మంది కాగా వీరిలో 6,318 మంది అభ్యర్థులు అఫిడవిట్లను దాఖలు చేశారు. వీరిపై అధ్యయనం జరిపిన తర్వాత ఏడీఆర్‌ నివేదిక ఇచ్చింది. ఇక వీరిలో 1,157 మంది అంటే 18% నేర చరిత్ర ఉన్నట్టు స్వచ్ఛందంగా అఫిడవిట్లలో వెల్లడించారు. 10 శాతం మంది 632 మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు అఫిడవిట్లలలో పేర్కొన్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే..

బెంగాల్.. మూడో విడత వరకు బరిలో ఉన్న మొత్తం 940 నామినేషన్లలో 567 నామినేషన్ల పరిశీలించగా వీరిలో.. 25 శాతం మంది అంటే 144 మంది అభ్యర్థులు నేర చరితులుగా ఉండగా. 21 శాతం (121 మంది) అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

తమిళనాడు.. తమిళనాడులో పోటీలో ఉన్న 3998మంది అభ్యర్థుల్లో 3,559 మంది నామినేషన్ల పరిశీలించగా.. వీరిలో నేర చరిత ఉన్న అభ్యర్థులు 466 (13%) మంది కాగా, తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైనవారి సంఖ్య 207( 6%)గా ఉంది.

కేరళ.. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం బరిలో ఉన్న 957మంది అభ్యర్థుల్లో 928 అభ్యర్థుల నామినేషన్ల పరిశీలించగా.. వీరిలో నేర చరిత ఉన్న అభ్యర్థులు 355 మంది ( 38%)మంది కాగా, 167 (18%) మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసలున్నాయి.

అస్సాం.. అస్సాం అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 946మంది అభ్యర్థుల్లో 941 మంది అభ్యర్థుల నామినేషన్ల పరిశీలించగా.. వీరిలో నేరచరిత ఉన్న అభ్యర్థులు 138 (15%)మంది.. అలాగే 109 (12%) తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్న వారున్నారు.

పుదుచ్చేరి.. పుదుచ్చేరిలో మొత్తం బరిలో ఉన్న 324 మందిఅభ్యర్థుల్లో 323 అభ్యర్థుల నామినేషన్ల పరిశీలిచంగా.. వీరిలో నేరచరిత ఉన్న అభ్యర్థులు 54(17%) మంది కాగా.. 28 (9%) మంది తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారున్నారు.

పార్టీల వారీగా బరిలో ఉన్న నేర చరితులు..

ఇక పార్టీల వారీగా బరిలో ఉన్న నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల విషయానికొస్తే.. డీఎంకేలో 143 మంది, తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు 55 మంది ఉన్నారు. ఏఐఏడీఎంకేలో 50మంది, తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు 21 మంది ఉన్నారు. ఏఐటీసీలో 29 మంది, తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు 23 మంది ఉన్నారు. బీజేపీలో 163 మంది, తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు 108 మంది ఉన్నారు. కాంగ్రెస్‌లో 132 మంది, తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు 82 మంది ఉన్నారు. సీపీఎంలో 77 మంది, తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు 39 మంది ఉన్నారు. సీపీఐలో 14 మంది..తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు ముగ్గురు ఉన్నారు. డీఎండీకే 18 మంది, పీఎంకే..10 మంది అభ్యర్థులు ఉన్నారు.

రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు ఇవే..

ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది నేరచరితులు బరిలో ఉన్న సీట్లల్లో ‘రెడ్ అలర్ట్ నియోజకవర్గాల’ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.. రాష్ట్రాల వారీగా ‘రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు’ ఇవే.. తమిళనాడు – 74 కేరళ – 75 పశ్చిమబెంగాల్ – 13 అస్సాం – 13 పుదుచ్చేరి – 8

Also Read: విపత్కర సమయంలో దేశ సేవకు అంకితం.. రైల్వే ఉద్యోగులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

పెళ్లి చేయమని ఏకంగా సీఎంనే కలిసాడు.. పోలీసులకు పిల్లను చూడమని చెప్పాడు.. చివరకు ఏమైందంటే..?

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు