జూబ్లీహిల్స్ హత్యకు కారణం వివాహేతర సంబంధమేనా..? పోలీసుల అదుపులో నిందితుడు.. మృతుడి భార్య
Jubileehills' Murder : జూబ్లీహిల్స్ పరిధిలో గురవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. నిందితుడితో పాటు మృతుడి భార్యను
Jubileehills’ Murder : జూబ్లీహిల్స్ పరిధిలో గురవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. నిందితుడితో పాటు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
హైదరాబాద్ కార్మికనగర్‌లో ఉండే టైలర్ సిద్దిఖ్ అహ్మద్(38) మార్చి 30న ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. అయితే అంతకు ముందు అతడు శ్రీరంనగర్‌లో ఉండే తన బావమరిది ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరైనట్లు తెలుస్తోంది.. అక్కడి నుంచి ఇంటికి రాగా అతడి వెనకాలే మరో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలో కనిపిస్తోంది..
అయితే ఆ వ్యక్తి తెల్లవారుజామున ఓ సంచిని పట్టుకొని బయటికి వచ్చినట్లు కెమెరాలో రికార్డ్ అయింది..ఉదయం 5.45 గంటల సమయంలో కార్మికనగర్ చౌరస్తా కూడలి వరకు వచ్చిన అతను తరువాత ఎటు వెళ్లాడనేది గుర్తించలేకపోయారు. హతుని ఇంట్లోంచి ఎత్తుకెళ్లి సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు మెహిదీపట్నం చౌరస్తాలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు అలీగా నిర్ధారించారు.
మృతుడి సోదరుడి ఫిర్యాదులో భార్య రుబినాపై అనుమానం వ్యక్తం చేయడంతో అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరి కాల్ డేటాను పరిశీలిస్తే.. రుబీనా ఫోన్ నుంచి అలీకి, హత్య అనంతరం అలీ ఫోన్ నుంచి రుబీనాకు కాల్స్ వెళ్లినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హత్యకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీసే క్రమంలో ఇద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నారు.