Attempt To Break ATM: గచ్చిబౌలిలో ఏటీఎమ్ చోరీకి యత్నించిన ఆగంతకుడు.. ఫొటోలు షేర్ చేసిన పోలీసులు..
Attempt To Break ATM: టెక్నాలజీ ఎంత పెరిగినా.. నేరాలు చేస్తే సులువుగా దొరికిపోతామని తెలిసినా కేటుగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్టపడట్లేదు. మరీ ముఖ్యంగా పూర్తిగా సెక్యూరిటీ పరిధిలో ఉండే ఏటీఎమ్ సెంటర్లపై దాడులకు దిగడం ఇటీవల మరీ ఎక్కువైపోయింది. ఓ వైపు..
Attempt To Break ATM: పెరిగిన టెక్నాలజీతో.. నేరాలు చేస్తే సులువుగా దొరికిపోతామని తెలిసినా కేటుగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్టపడట్లేదు. మరీ ముఖ్యంగా పూర్తిగా సెక్యూరిటీ పరిధిలో ఉండే ఏటీఎమ్ సెంటర్లపై దాడులకు దిగడం ఇటీవల మరీ ఎక్కువైపోయింది. ఓ వైపు సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఏటీఎమ్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఓ దుండగుడు కెమెరా కంటికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం (శనివారం) ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉదయం నాలుగు గంటల సమయంలో గచ్చిబౌలిలో ఉన్న ఓ ఏటీఎమ్‌లోకి చోరీకి వెళ్లాడు. లోపలికి వెళ్లనయితే వెళ్లాడు కానీ ఏటీఎమ్‌ను ఎలా దొంగలించాలో తెలియలేదు. కాసేపు విశ్వప్రయత్నం చేసి ఎంతకూ ఏటీఎమ్ ఓపెన్ కాకపోయే సరికి అక్కడి నుంచి తిరుగు పయణమయ్యాడు. అయితే ఆ దొంగ అక్కడ సీసీ కెమెరా ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోక పోవడం గమనార్హం. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో సదరు వ్యక్తి ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటోలను గచ్చిబౌలి పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తుపడితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 94906 17127కు లేదా సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ 9490617444కు సమాచారం అందించమని కోరారు. మరి ఆ దొంగపై ఓ లుక్కేయండి ఒకవేళ గుర్తు పడితే పోలీసులకు అప్పగించండి.. సమాజంలో మీ బాధ్యతను పాటించండి.
పోలీసులు చేసిన ట్వీట్..
An attempt to break ATM at Gachibowli in the early hours. Any citizen recognizing this person may inform us on SHO Gachibowli PS -94906 17127 or Cyberabad Whatsapp 9490617444. pic.twitter.com/zXbL8awxAV
— SHO GACHIBOWLI (@psgachbwli_cyb) April 3, 2021
Rajasthan: బాధితురాలిపై లైంగిక వేధింపులు.. రాజకీయ దుమారంతో ఏసీపీని డిస్మిస్ చేసిన ప్రభుత్వం
‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’