AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’

Drunken Driving : 'తాగకురా.. తాగి బండి నడపకురా. నువ్వు కర్సయిపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసిన..

'వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు'
Venkata Narayana
| Edited By: Team Veegam|

Updated on: Apr 03, 2021 | 11:32 AM

Share

Drunken Driving : ‘తాగకురా.. తాగి బండి నడపకురా. నువ్వు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాడివవుతావ్..’ అని చెవిలో జోరిగలా పదే పదే చెప్తున్నా.. కొందరికి ఇంకా చెవికెక్కడం లేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. వాళ్ల లైఫ్‌ రిస్క్‌లో పడ్డమే కాదు..ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. ఎస్‌..   తాగుబోతులు టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరంగా మారుతున్నారు. మాదాపూర్‌ ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి ఘటన మరువకముందే మరో నిండు ప్రాణం బలైంది.

హైదరాబాద్‌లో తాగుబోతు డ్రైవర్లు నిత్యం మయకింకరులుగా అవతారాలెత్తుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కిల్లర్‌ డ్రైవర్స్‌ ముగ్గురిని బలితీసుకున్నారు. తాజాగా అంబర్‌పేట్‌లో తాగుబోతు డ్రైవర్లు మల్లమ్మ అనే మహిళను బలితీసుకున్నారు. ఫుల్‌గా తాగి..జెట్‌స్పీడుతో దూసుకొచ్చిన కారు ..రోడ్డుదాటుతున్న ఓ అమాయకురాలిని పొట్టనబెట్టుకుంది. ఇక, కూకటపల్లి- నిజాంపేట క్రాస్‌ రోడ్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండగా..ఓ కారు దూసుకు వచ్చింది. సృజన్‌ అనే బిటెక్‌ స్టూడెంట్‌ ఫుల్‌గా మందేసి కారులో రోడ్డెక్కాడు. పోలీసులను చూసి ఎస్కేపయ్యే ప్రయత్నంలో పిల్లర్‌ను ఢీకొట్టాడు. అదే టైమ్‌లో ఏఎస్‌ఐ మహిపాల్‌ రెడ్డి అక్కడకు వచ్చారు. ఆరా తీస్తున్న క్రమంలోనే క్యాబ్‌ దూసుకొచ్చి మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిపాల్‌ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మహిపాల్‌ కన్నుమూశారు.

మహిపాల్ మరణించిన విషాధాన్నుంచి తేరుకోకముందే మాదాపూర్‌లో మరో దారుణం జరిగింది. పూటుగా మద్యం తాగి రోడ్డెక్కిన ఓ పోరంబోకు.. స్పీడ్‌గా దూసుకెళ్లి మహిళను ఢీకొట్టాడు, ఈఘటనలో కవిత అక్కడికక్కడే చనిపోయారు. ఆమెకు ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు సీపీ సజ్జనార్‌. తాగి వాహనాలు నడిపినవారు ముమ్మాటికీ టెర్రరిస్టులేనన్నారు సీపీ.

జరిమానాలు విధించినా..జైలుకు పంపుతున్నా మందు బాబుల ఆగడాలకు మాత్రం కళ్లెం పడ్డంలేదు. తాగిన మైకంలో యాక్సిడెంట్లు చేయడం..అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడం..దాడులకు సైతం పాల్పడ్డం నిత్యకృత్యాలవుతున్నాయి. తాజాగా మూడు కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు కొనసాగాయి. నిన్న ఒక్కరోజే 255 కేసులను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నమోదు చేశారు. జైలుశిక్ష, భారీ జరిమానాలు విధిస్తున్నా తాగుబోతుల్లో మార్పు రాకపోవడం అత్యంత బాధాకరం.

Read also : Gorantla Butchaiah Chowdary : జ్యోతుల నెహ్రూ నిర్ణయం, కొత్త ఎన్నికల కమిషనర్ తీరుపై టీవీ9తో బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు