Nagarjuna Sagar Bypoll: వామ్మో ఇలాంటి వ్యక్తిని ప్రపంచంలోనే చూడలేదు.. నోముల భగత్‌పై వర్మ సంచలన ట్వీట్..

Nagarjuna Sagar Bypoll: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సెపరేట్. ఆయన ఏం చేసినా విభిన్నంగానే ఉంటుంది.

Nagarjuna Sagar Bypoll: వామ్మో ఇలాంటి వ్యక్తిని ప్రపంచంలోనే చూడలేదు.. నోముల భగత్‌పై వర్మ సంచలన ట్వీట్..
Ramgopal Varma
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 03, 2021 | 1:35 PM

Nagarjuna Sagar Bypoll: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సెపరేట్. ఆయన ఏం చేసినా విభిన్నంగానే ఉంటుంది. అదే సమయంలో వివాదమూ అవుతుంది. ముఖ్యంగా గత ఐదారేళ్ల కాలాన్ని గమనిస్తే వర్మ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను బాగా కెలికారని చెప్పుకోవచ్చు. తన వివాదాస్పద సినిమాలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఓ ఊపు ఊపేశారు. రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్‌ సినిమాలతో రచ్చ రచ్చ చేశారు. ఇలా తన సినిమాలతో, ట్వీట్లతో నిత్యం సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచే రామ్‌గోపాల్ వర్మ.. తాజాగా మరో ట్వీట్ చేసి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారు. అయితే, ఆయన చేసిన ట్వీట్ అంత సీరియస్ కాకపోయినప్పటికీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ అది హాట్‌టాపిక్‌గా మారింది. నెటిజన్లంతా వర్మ ట్వీట్‌కు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారు? అంతలా చర్చకు దారి తీసిన ట్వీట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాగార్జునసాగర్ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో నాగార్జునసాగర్‌కు ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నిక బరిలో నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌ను టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దింపింది. ఎమ్మెల్యేగా అతనిచే పోటీ చేయిస్తోంది. అయితే, ఈ ఎన్నికల నేపథ్యంలోనే నోముల భగత్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. అడవి ప్రాంతంలో చిరుత పులిని పట్టుకుని నోముల భగత్ వాకింగ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అది కాస్తా వర్మ కంట పడటంతో.. దాన్ని ఆయన షేర్ చేశారు. అంతటితో ఊరుకుంటే వర్మ ఎలా అవుతారు.. దానికి కాస్త డిఫరెంట్ క్యాప్షన్ జోడించారు. ‘‘వామ్మో.. కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్, సింహాలు అని మనకు తెలుసు. కానీ, చిరుత పులిని పట్టుకుని వాకింగ్ చేస్తున్న నోముల భగత్ నాకు బాగా నచ్చాడు. నాకే గనుక అక్కడ ఓటు హక్కు ఉంటే.. ఈనెల 17న నాగార్జున సాగర్‌లో జరిగే ఉపఎన్నికలో భగత్‌కే నేను ఓటు వేసేవాడిని’’ అంటూ క్యాప్షన్ పెట్టి వర్మ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ అలా ఉండగానే.. రామ్‌గోపాల్ వర్మ మరో ట్వీట్ కూడా చేశారు. ‘నోముల భగత్.. ‘మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గర్జనకు ఏ ఒక్క పార్టీ కూడా నిలబడలేదు. మరే పార్టీ కూడా తమను ఎదుర్కోలేదు.’ అంటున్నారు. చిరుత పులిని చేతపట్టి ఎన్నికల ప్రచారం చేసిన వ్యక్తిని ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదు.’ అని వర్మ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్లు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎన్నికల్లో మరింత హీట్ పెంచాయి. భగత్‌కు వర్మ ఇన్‌డైరెక్ట్‌గా ప్రచారం చేసిపెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. వర్మ చేసిన ఈ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అది గ్రాఫిక్స్ వీడియో అని కొందరు అంటుంటే.. అది నిజం అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఉపఎన్నికల రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్.. నోముల భగత్‌కు మరింత ప్రచారాన్ని కల్పించిందనే చెప్పాలి.

Ram Gopal Varma Tweet: