Telangana Corona Cases Updates: తెలంగాణను హడలెత్తిస్తున్న కరోనా.. మళ్లీ వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు.. శాస్త్రవేత్తల వార్నింగ్..
Telangana Corona Cases Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రోజువారి కరోనా..
Telangana Corona Cases Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. కొన్ని నెలల గ్యాప్ తరువాత మళ్లీ ఇంతటి స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,078 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో అంటే శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 3,10,819 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 1,712 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,900 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 3,116 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 3,02,207 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.55 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.22 శాతంగా ఉంది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 283 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజిగిరి 113, రంగారెడ్డి జిల్లా పరిధిలో 104 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించడంతో పాటు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే.. కరోనా సెకండ్ వేవ్‌పై శాస్త్రవేత్తల హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల మధ్య నాటికి కరోనా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ తరువాత కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. సూత్ర అనే గణిత నమూనాతో కాన్పూర్ శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తిపై లెక్కలేశారు. దీని ప్రకారం ఈనెల మధ్య నాటికి కరోనా పీక్స్ స్టేజికి చేరుతుందని, ఆ తరువాత నెమ్మదిస్తుందన్నారు.
Also read:
జోరు పెంచిన మెగాహీరో.. మూడో సినిమాను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.. క్లాప్ కొట్టిన సాయి ధరమ్ తేజ్
ఐదేళ్లకోసారి ఊరు బంధనం..తెల్లవారుజామున విచిత్ర పూజలు.. తెలంగాణలోని ఆ ప్రాంతంలో వెరైటీ బోనాలు