India Corona Cases Updates: భారత్‌లో మరింత విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య..

India Corona Cases Updates: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి.

India Corona Cases Updates: భారత్‌లో మరింత విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య..
India Corona 2
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 03, 2021 | 10:38 AM

India Corona Cases Updates: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య 80వేలు దాటింది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 89,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కారణంగా 714 మంది చనిపోయారు. 44,202 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజా లెక్కల ప్రకారం.. భారత్‌లో మొత్తం 1,23,92,260 మందికి కరోనా సోకగా.. వారిలో 1,64,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,58,909 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,15,69,241 కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. ఇదే సమయంలో రికవరీ రేటు 93.36 శాతంగా ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో మహారాష్ట్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 47,827 కరోనా కేసులు నమోదవగా.. 202 మరణాలు సంభవించాయి. ఒక్క ముంబైలోనే 8,823 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 3,594 కరోనా కేసులు నమోదవగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రంలో తాజాగా 4,174 కరోనా కేసులు నమోదైతే.. 43 మంది మృతి మృత్యవాతపడ్డారు. కర్నాటకలో 4,991 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఆరుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 2,777 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా సోకి 16 మంది బాధితులు తమ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 3,290 కరోనా కేసులు నమోదవగా.. 12 మరణాలు సంభవించాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో 2,967 కరోనా కేసులు నమోదు అవగా.. 16 మంది కరోనాతో చనిపోయారు.

ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనా వైరస్ ఇంతలా విజృంభిస్తుండడంపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ఒక పరిశోధన చేసింది. దీనిలో దిగ్ర్భాంతికరమైన విషయం తేలింది. ఇప్పుడు కరోనా సోకుతున్న వారిలో 4.5శాతం మంది గతంలో ఆ వైరస్‌ బారిన పడినవారేనని వెల్లడించింది. ఈ సంస్థ 1300 మందిపై చేసిన పరిశోధనా నివేదికను ఎపిడెమియాలజీ అండ్‌ ఇన్‌ఫెక్షన్‌ జర్నల్‌ ప్రచురించింది. టీకా ఇస్తున్నప్పటికీ.. పర్యవేక్షణ, నిబంధనలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Also read:

ఇక ఏటీఎం కార్డు అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. డబ్బు తీయొచ్చు…!! ఎలాగో తెలుసుకోండి.. ( వీడియో )

‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’