AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Banks: హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంత పెంచారంటే..

HDFC Banks: మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ కస్టమరా? బ్యాంకులో మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? అయితే మీకో శుభవార్త.

HDFC Banks: హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంత పెంచారంటే..
Hdfc Banks
Shiva Prajapati
|

Updated on: Apr 03, 2021 | 8:38 AM

Share

HDFC Banks: మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ కస్టమరా? బ్యాంకులో మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి.. కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వివిధ కాలపరిమితిలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 30వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. ఒక కస్టమర్.. 33 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే.. వారికి 6.2 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తుంది. అలాగే 66 నెలల నుంచి 99 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్ అయితే సంవత్సరం వడ్డీ 6.5 శాతం నుంచి 6.65 శాతం వరకు ఉంది.

ఇక్క ఒక బేసిస్ పాయింట్ అంటే బ్యాంకింగ్ రంగంలో 0.01 శాతం అని అర్థం దాని ప్రకారం.. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే గరిష్ఠ కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారో వారికి అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో హెచ్‌డిఎఫ్‌సి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం కస్టమర్లకు శుభపరిణామం అనే చెప్పాలి. పూర్తి వివరాల కోసం హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్, లేదా కస్టమర్‌కేర్‌ని సంప్రదించవచ్చు.

Also read:

Cash Withdraw with UPI App: పేటీఎం, గూగుల్‌ పే యాప్‌తో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయిచ్చు.. అదెలాగంటే..

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Kalvakuntla kavitha : రెండోదఫా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత