AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ప్రతి రోజూ రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని రోజును ప్రారంభిస్తుంటారు. అలాంటి వారు రోజులో చేపట్టాల్సిన పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది.. శనివారం  రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2021 | 7:32 AM

Share

Horoscope Today: మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ప్రతి రోజూ రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని రోజును ప్రారంభిస్తుంటారు. అలాంటి వారు రోజులో చేపట్టాల్సిన పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి లాంటి వివరాలు తెలుసుకొని రోజును ప్రారంభించడం ఉత్తమం. మరి ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

మేష రాశి: మేష రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల విషయంలో ఏమాత్రం తొందరపడకపోవడం మంచింది. అలాగే చేయాలనుకున్న పనులను వాయిదా వేయడం కూడా చేయకూడదు. సుభ్రమణ్య స్వామి ఆదార్ధన మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు పౌ శుభకార్యాలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. రావలిసిన బాకీలు వాసులు చేసుకుంటారు. దక్షిణామూర్తి స్వామి ఆరాధనా మేలు చేస్తుంది.

మిథున రాశి: మిథున రాశి వారు ఈరోజు కష్టమైన పనులు చేపడుతుంటారు. బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పలు రకాల ఒత్తిళ్లకు లోనయ్యే  పరిస్థితులు ఏర్పడతాయి. నవగ్రహ స్తోత్రపారాయణం మంచి చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. లక్ష్మీ, నరసింహస్వామివారి దర్శనం మేలు చేస్తుంది.

సింహ రాశి: సింహ రాశి వారు ఈరోజు తెలియని విషయాలను తెలుసుకునే ప్రత్యత్నాలు చేస్తారు. పెద్దవారిని కలుసుకొని తెలియవిషయలపై చర్చిస్తుంటారు. శివ పంచాక్షరీ జపం మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశి వారు ఈరోజు వృత్తి, వ్యాపార విషయాల్లో కొంత యోగదాయకంగా ఉంటుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. సామజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నవగ్రహ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి: తులా రాశి వారికి కుటుంబపరమైన బాధ్యతలు పలు రకాల ఒత్తిళ్లు పెరుగుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉంటూ వయవహరించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి అర్చన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు  చేప్పట్టిన పనులన్నీ ఫలించే అవకాశాలు ఉన్నాయి. రావలసిన బాకీలు వాసులు చేసుకుంటారు. హనుమాన్ చాలీసా పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఈరోజుపరిచయాలు పెరుగుతూఉంటాయి. కొన్ని తెలియని విషయాలను తెలుసుకుంటారు. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం అలాగే అష్టలక్ష్మీ పారాయణం శుభప్రదం చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహాలను పొందుతారు. శ్రీ రాజమాతంగి నమః అనే నామస్మరణ మేలు చేస్తుంది.

కుంభ రాశి: కుంభ రాశి వారు బంధువులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకపోవడం మంచింది. దుర్గ సప్త శ్లోక పారాయణం మంచి చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మంచి చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Reliance Jio: రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లు.. జియో బిజినెస్‌ ఆఫర్‌

Kalvakuntla kavitha : రెండోదఫా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత