Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లు.. జియో బిజినెస్‌ ఆఫర్‌

Reliance Jio: టెలికాం రంగంలో డేటా విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో కీలక నిర్ణయంతో ముందుకెళ్తోంది. కస్టమర్లను మరింతగా పెంచుకునేందుకు జియో కొత్త వ్యూహాలను సిద్ధం..

Reliance Jio: రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లు.. జియో బిజినెస్‌ ఆఫర్‌
Reliance Jio
Follow us
Subhash Goud

|

Updated on: Apr 03, 2021 | 7:15 AM

Reliance Jio: టెలికాం రంగంలో డేటా విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో కీలక నిర్ణయంతో ముందుకెళ్తోంది. కస్టమర్లను మరింతగా పెంచుకునేందుకు జియో కొత్త వ్యూహాలను సిద్ధం అవుతోంది. జియో ఫోన్లపై ఆఫర్లను ఇవ్వనుంది. అంతేకాదు అతి తక్కువ ధరకు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీని ద్వారా భారీగా కస్టమర్లను పెంచుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇలా చేయడం ద్వారా యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ పెరుగుతోందని జియో భావిస్తోంది. స్మార్ట్‌ ఫోన్లపై భారీగా ఆఫర్లు ఇవ్వడం, తక్కువ ధరకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడం ద్వారా సబ్ స్క్రైబర్ల పెరుగుదలను నమోదు చేయవచ్చని జియో భావిస్తోంది. అయితే కొన్ని రోజులుగా జియో నుంచి స్మార్ట్‌ ఫోన్లు రాబోతున్నాయన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తక్కువ ధరకు డేటా అందించి దేశంలో ఇంటర్‌ నెట్‌ విప్లవాన్ని తీసుకువచ్చిన జియో నుంచి రాబోతున్న స్మార్ట్‌ ఫోన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అత్యంత తక్కువ ధరకే మార్కెట్లో ఈ స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని అనేకమంది భావిస్తున్నారు.

జియో బిజినెస్‌ ప్లాన్స్‌..

ఇదిలా ఉంటే చిన్న, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలు నిర్వహించేవారికి జియో బిజినెస్‌ పేరుతో సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ ప్రకటించింది జియో. తక్కువ ధరకే డేటా, వాయిస్‌ సేవలను అందిస్తోంది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని అవరాలకు తగ్గట్లుగా ప్లాన్స్‌ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌ నెలకు రూ.901తో ప్రారంభం అవుతుంది. రూ.10,001 వరకు కూడా ప్లాన్స్‌ ఉన్నాయి. వేర్వేరు ప్లాన్స్‌కు ప్రయోజనాలు కూడా వేరుగా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్, స్టాటిక్ ఐపీ, ప్రొడక్టివిటీ, జియో అటెండెన్స్, మార్కెటింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్‌లు లభిస్తాయి.

జియో బిజినెస్ రూ.901 ప్లాన్ తీసుకుంటే 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఒక లైన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. అలాగే జియో బిజినెస్ రూ.1,201 ప్లాన్ తీసుకుంటే 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. రెండు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 2 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియో ఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది.

ఇవీ చదవండి: Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?

Two Wheeler Sales: మార్చి నెలలో భారీగా పెరిగిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ప్రజలు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు