Royal Enfield Bike: బంపర్ ఆఫర్.. కేవలం రూ.50 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్.. ఏ మోడల్ అంటే..
Royal Enfield Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే ఓ మంచి అవకాశం. అతి తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ గల బైక్ ..
Royal Enfield Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే ఓ మంచి అవకాశం. అతి తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ గల బైక్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలంటే దాదాపు రూ.2 లక్షల వరకు జేబులో పెట్టుకొని షోరూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే కొత్త బైక్ కొనే స్థోమత లేకపోతే సెకండ్‌హ్యాండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. సెకండ్ హ్యాండ్‌లో కూడా ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. దాదాపు రూ.80వేలకుపైగానే ఉంటాయి. ఇక కొత్త బైక్ తీసుకోవాలనుకున్నా.. కొంత డబ్బు కట్టి ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. కానీ నెలనెల క్రమం తప్పకుండా కట్టాల్సి ఉంటుంది. లేకపోతే పెనాల్టీతో తడిసిమోపెడవుతుంది. అలాంటి రిస్క్‌లు అవసరం లేదనుకున్నప్పుడు సెకండ్‌హ్యాండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే కేవలం రూ.50 వేలకు సెకండ్‌హ్యాండ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఎలాంగంటే అందుకు ఆప్షన్ కూడా ఉంది. అదే డ్రూమ్ వెబ్‌సైట్ ద్వారా. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ (Royal Enfield Thunderbird 350) బైక్ ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కేవలం రూ.50 వేలు, 2011 మోడల్ కలిగి ఉంది. అది కూడా తక్కువ కిలోమీటర్లు తిరిగిన బైక్. ఈ బైక్‌ను కొనాలంటే డ్రూమ్ (Droom) వెబ్‌సైట్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ బైక్‌ను కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంత తక్కువ ధర ఎందుకు పెట్టారు.. బైక్‌లో ఏమైనా లోపాలున్నాయా..? లేక బైక్ యజమాని తక్కువ ధరకే అమ్మేస్తున్నాడా..? అనే విషయాలు తెలుసుకోవాలి.
కాగా, ఇలాంటి బైక్‌లో అతి తక్కువ ధరకే ఈ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ బైక్ కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందులో ఈ బైక్‌ను నడపాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే ఎక్కువ డబ్బులు పెట్టుకోలేని వారికి ఇలా సెకండ్ హ్యాండ్‌లో అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వారికున్న కలను నెరవేర్చుకోవచ్చు.
ఇవీ చదవండి: Reliance Jio: రిలయన్స్ జియో కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు.. జియో బిజినెస్ ఆఫర్
Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?