Petrol and Diesel Price: స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో చోట ఒక్కోలా.. పూర్తి వివరాలు..
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా చమురు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. వాస్తవానికి ఆర్థిక...
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా చమురు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయేమో అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫిబ్రవరి నెల మధ్య వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ (రూ.100) కొట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటినప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో 95, 96, 97 రూపాయల చొప్పున ఉంది. ఇదిలాఉంటే.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
శనివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పరిశీలించినట్లయితే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ. 88.20 లకు లభిస్తోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.74 ఉండగా, లీటర్ డీజిల్ ధర 87.80 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.24గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.27గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.60 కాగా డీజిల్ ధర రూ. 90.10గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 95.52 గా, డీజిల్ ధర రూ. 89.06 గా నమోదైంది.
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 90.56 రూపాయలకు లభిస్తుండగా.. డీజిల్ 80.87 రూపాయలకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ చమరు ధరలు స్థిరంగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్ రూ. 87.96గా ఉంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ దర రూ. 90.77గా ఉండగా, డీజిల్ ధర రూ. 83.75గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ ధర 93.59 గాఉండగా.. డీజిల్ ధర 85.75 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58గా ఉండగా.. డీజిల్ ధర రూ. 85.88 గా ఉంది.
Also read: