Pawan Kalyan: తిరుపతిలో జనసేన అధినేత పవర్‌ కల్యాణ్‌ పర్యటన.. ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పాదయాత్ర

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌, బీజేపీ నేతలు శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. అయితే ఎంఆర్‌పల్లి సర్కిల్‌ నుంచి శంకరంబాడి వరకు పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర..

Pawan Kalyan: తిరుపతిలో జనసేన అధినేత పవర్‌ కల్యాణ్‌ పర్యటన.. ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పాదయాత్ర
Pawan
Follow us
Subhash Goud

|

Updated on: Apr 03, 2021 | 6:33 AM

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌, బీజేపీ నేతలు శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. అయితే ఎంఆర్‌పల్లి సర్కిల్‌ నుంచి శంకరంబాడి వరకు పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. పాదయాత్ర తర్వాత బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తారని అన్నారు. అలాగే పవన్‌ రెండో విడత పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంటుందని వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా పర్యటన ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం ఉంటుందన్నారు.

కాగా, ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు. జనసేనాని పవన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు 4 రాయలసీమ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని అన్నారు. జనసేనానితో కలిసి తామంతా కూడా పాదయాత్రలో పాల్గొని రత్నప్రభను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించనున్నట్లు నాదెండ్ల పేర్కొన్నారు.

బీజేపీ, జనసేన పొత్తుపై అనేక అనుమానాలు, అపోహలు, అసత్యాలు సృష్టించి ప్రత్యర్థులు దుష్ర్పచారం చేస్తున్నారని.. కానీ, రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే రెండు పార్టీలు కలిసినట్లు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్‌ మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: చంద్రబాబు చెప్పీచెప్పంగానే ఎంటరైపోయిన విజయసాయి, దుకాణం మూసే ముందు డిస్కౌంట్‌ ఆఫర్లంటూ సెటైర్లు

పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. మనకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోంది : మంత్రి పేర్ని