TTD News: తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త.. గదుల కోసం ఇకపై వెయిటింగ్‌కు చెక్

కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. గదుల కోసం ఇకపై కళ్లుకాయలు కాచేలా చూసే అవసరం భక్తులకు లేదు.

TTD News: తిరుమల వెంకన్న  భక్తులకు శుభవార్త.. గదుల కోసం ఇకపై వెయిటింగ్‌కు చెక్
Ttd rooms
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 03, 2021 | 8:45 AM

కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. గదుల కోసం ఇకపై కళ్లుకాయలు కాచేలా చూసే అవసరం భక్తులకు లేదు. ఈ విషయాన్ని ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో గదులు ముందుగా‌ బుకింగ్‌ చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వో ఆఫీసుకు వెళ్లి అక్కడి నుంచి సబ్‌ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు. ఈ ప్రక్రియ కోసం భక్తులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది . అందుకే ఈ పద్దతిలో మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు.

తిరుమలకు వచ్చే భక్తులు టికెట్లు అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద స్కాన్‌ చేసిన వెంటనే మెసేజ్‌ ద్వారా మొబైల్‌ నంబర్లకు సబ్‌ ఎంక్వైరీ ఆఫీసు వివరాలు తెలియజేస్తామన్నారు. భక్తులు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి గదులు పొందవచ్చని చెప్పారు. మరో పది రోజుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు తీసుకునే భక్తులు అదే స్క్రీన్‌పై గదులను బుక్‌ చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో మార్పులు తీసుకువస్తామని తెలిపారు.

తిరుమల వెంకన్న సన్నిధిలో ఈనెల 13న శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈవో. ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుమల వసంత మండపంలో స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: ఎండాకాలం వడగాల్పులతో తస్మాత్ జాగ్రత్త.. మండే గాలుల బారిన పడితే మటాష్

కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే