AP local bodies sworn : ఏపీ వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళే

AP local bodies sworn : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయతీల్లో ఇవాళ్టి నుంచి సర్పంచ్‌ల పాలన మొదలు కాబోతోంది. తొలి సమావేశం..

AP local bodies sworn : ఏపీ వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళే
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 03, 2021 | 11:31 AM

AP local bodies sworn : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయతీల్లో ఇవాళ్టి నుంచి సర్పంచ్‌ల పాలన మొదలు కాబోతోంది. తొలి సమావేశం ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని చోట్లా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫలితంగా నేటి నుంచి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు అధికారికంగా బాధ్యతల్లో కొలువుతీరుతారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని నిర్ణయించారు.

ఇలాఉండగా, దాదాపు రెండున్నరేళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి – ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,097 గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏప్రిల్‌ 3 వ తేదీన కొత్తగా ఎన్నికైన సభ్యులతో తొలి సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

దీంతో తాజాగా గ్రామాల్లో మళ్లీ సర్పంచ్‌ల పాలన కొనసాగబోతుంది. శనివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, వర్షపు నీటి సంరక్షణపై అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కొత్తగా ఎన్నికైన సభ్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది.

Read also : Breaking News : విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్, అక్కడికక్కడే దశరథ్ మ‌ృతి