పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. మనకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోంది : మంత్రి పేర్ని

AP Minister Perni Nani slams BJP on Special Status : పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.. ఏపీకి మాత్రం ముగిసిన..

పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. మనకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోంది : మంత్రి పేర్ని
Perni Nani
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 02, 2021 | 4:26 PM

AP Minister Perni Nani slams BJP on Special Status : పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.. ఏపీకి మాత్రం ముగిసిన అధ్యాయం అంటూ కబుర్లు చెబుతోంది అంటూ ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి పేర్ని నాని. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీ పచ్చి మోసకారి అని చెప్పిన ఆయన, పుదుచ్చేరికి హోదా ఇస్తామని నిర్మలాసీతారామన్ ప్రకటించింది.. ఏపీకి ఇవ్వలేని హోదా పుదుచ్చేరికి ఎలా ఇస్తారో బీజేపీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లో.. బీజేపీ రౌడీయిజం ఎలా చేస్తోందో మమత చెబుతున్నారు అని మంత్రి అన్నారు. పవన్ ను ఏపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంలో ఎలాంటి విశేషం లేదు.. కేఏ పాల్ కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు అంటూ నాని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ ఎలాంటి టార్గెట్లు ఇవ్వలేదని చెప్పిన నాని, జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ప్రజలు ఓట్లు వేయరని జోస్యం చెప్పారు.

Read also : Nilam Sawhney : ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దూకుడు.. తొలిరోజు వరుస భేటీలతో ఫుల్ బిజీ