Kalvakuntla kavitha : రెండోదఫా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Kalvakuntla kavitha : స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తాన‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు...

Kalvakuntla kavitha : రెండోదఫా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Mlc Kavitha
Follow us
Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: Apr 03, 2021 | 11:29 AM

Kalvakuntla kavitha : స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తాన‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్.. గవర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌తో కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత విస్తరించ‌నున్నట్లు ఆమె తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన‌ మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ కవిత 2015లో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా తొలిసారిగా ఎన్నికయ్యారు. మరోసారి రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎన్నికవడం పట్ల స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు, పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read also : JD Lakshminarayana : 2019 ఎన్నికలలో రూ. 3,451 కోట్ల రూపాయలు పట్టుబడింది.. ఇంతకీ ఆ సొమ్మంతా ఏమైంది : మాజీ జేడీ