JD Lakshminarayana : 2019 ఎన్నికలలో రూ. 3,451 కోట్ల రూపాయలు పట్టుబడింది.. ఇంతకీ ఆ సొమ్మంతా ఏమైంది : మాజీ జేడీ
Election time seized money : ఎన్నికలలో డబ్బుల ప్రభావం బాగా పెరిగిపోయింది అంటున్నారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. వీటివల్ల ఎన్నికల నిర్వహణ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లా..
Election time seized money : ఎన్నికలలో డబ్బుల ప్రభావం బాగా పెరిగిపోయింది అంటున్నారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. వీటివల్ల ఎన్నికల నిర్వహణ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో రూ. 3451 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని జేడీ తెలిపారు. ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు ఏం చేశారంటూ ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు అధికారులను అడుగగా…. పట్టుకున్న నగదంతా వెరిఫై చేసి తిరిగి వాళ్లకి ఇచ్చేశామని అధికారుల నుంచి సమాధానం వచ్చిందనీ అన్నారు. ఎన్నికల సమయంలో నేతల డబ్బులకు కస్టడీగా ఉంటున్నారు అంటూ సుప్రీంకోర్టు ఎద్దేవా చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో కంట్రోల్ టీం లు, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు పని చేస్తున్నా…. ఎన్నికలు అయిపోయాక పట్టుబడ్డ డబ్బు గురించి ఉండాల్సిన సీరియస్ నేస్ ఉండటం లేదనీ జేడీ ఆరోపించారు. ఎన్నికలపై డబ్బులు ప్రభావాన్ని తగ్గించడం చాలా అవసరం అని, లేకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం అని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. పట్టుబడిన డబ్బుకు సంబంధించి చివరి వరకు విచారణ జరిపి అలాంటి అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలనీ సూచించారు. ADR, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థలు ఎన్నికల్లో పరోక్షంగా 60 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని సర్వే ద్వారా చెబుతున్నాయని జేడీ పేర్కొన్నారు.
Read also : IT Raids : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడుల దడ, వందల కోట్ల రూపాయలు స్వాధీనం