ఐదేళ్లకోసారి ఊరు బంధనం..తెల్లవారుజామున విచిత్ర పూజలు.. తెలంగాణలోని ఆ ప్రాంతంలో వెరైటీ బోనాలు

ప్రతి ఐదేళ్లకొసారి..జరిగే గ్రామ దేవతల పూజల కోసం ఆ ఊరు ఊరంతా కలిసి కట్టుగా ఉంటుంది. గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలు, గొడ్డుగోదా, ప్రజలందరూ...

ఐదేళ్లకోసారి ఊరు బంధనం..తెల్లవారుజామున విచిత్ర పూజలు.. తెలంగాణలోని ఆ ప్రాంతంలో వెరైటీ బోనాలు
Bonalu
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 03, 2021 | 9:20 AM

ప్రతి ఐదేళ్లకొసారి..జరిగే గ్రామ దేవతల పూజల కోసం ఆ ఊరు ఊరంతా కలిసి కట్టుగా ఉంటుంది. గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలు, గొడ్డుగోదా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఐదేళ్లకోసారి పెద్దఎత్తున పోచమ్మకు కొలుపు చేస్తారు. అయితే పూజలు పూర్తయ్యే వరకు ఊరు ఊరంతా ముఖం కడగరు, చీపురు పట్టి వాకిలి ఊడ్చేది లేదు..కళ్లాపి చల్లేది లేదు…ఇది ఆ ఊరిలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమేనండోయ్‌…ఇంతకీ ఈ పండగ ఎక్కడో చెప్పనే లేదు కదా..?

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే గ్రామ దేవత పోచమ్మ, భూలక్ష్మి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమ గ్రామంలో కరోనా సోకకూడదని పెద్దఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఊరు ఊరంతా డప్పు చప్పుళ్లు, బోనాలు, శివసత్తులు పూనకాలతో పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రజల్ని చల్లాగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు.

ఈ క్రమంలో ఊరు ఊరంతా ఒక రోజు ముందే బంధనం వేస్తారు. ఈ గ్రామంలోకి ఎవరూ రాకూడదు, ఈ గ్రామం నుండి ఎవ్వరూ పొరుగు గ్రామానికి వెళ్లకూడదు. అందులో భాగంగా పోచమ్మ ఆలయానికి ఇంటికో భోనం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం తెల్లవారుజామున భూలక్ష్మి విగ్రహాల వద్ద పట్నం వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే తంతులో.. గొర్రెపిల్లను బైండ్ల పూజారులు గావుపట్టి రక్తతర్పణం చేసి అమ్మవార్లను ప్రసన్నం చేసుకుంటారు.

అయితే, మరో విచిత్రం ఏంటంటే…ఈ పూజాది కార్యక్రమాలు ముగిసే వరకు…ఎంత సమయం అయినా సరే…ఎవ్వరూ వాకిలి ఊడవరు, కళ్ళాపి చల్లరు. ఈ తంతు ముగిసిన తర్వాతే గ్రామంలో వాకిళ్లు ఊడ్చి, పేడతో అలుకు చల్లి, ముగ్గులు వేసి ఎప్పటిలాగా ఇళ్లలోకి వస్తారు గ్రామ ప్రజలు. అయితే ఈ ఏడు కరోనా కారణంగా ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. అయినా కానీ ఇంటికొకరు వచ్చి భౌతిక దూరం పాటిస్తూ పోచమ్మ, భూలక్ష్మి మాతలకు మొక్కులు చెల్లించుకున్నారు గ్రామ ప్రజలు.

Also Read: కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు

తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త.. గదుల కోసం ఇకపై వెయిటింగ్‌కు చెక్