Vaccines export: అది ప్రచారం మాత్రమే.. టీకాల ఎగుమతిపై ఎలాంటి నిషేధం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Central government - Covid-19 Vaccine: భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే తగ్గిన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. మళ్లీ భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కేంద్రం, రాష్ట్రాలు

Vaccines export: అది ప్రచారం మాత్రమే.. టీకాల ఎగుమతిపై ఎలాంటి నిషేధం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Corona Vaccine
Follow us

|

Updated on: Apr 03, 2021 | 2:09 AM

Central government – Covid-19 Vaccine: భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే తగ్గిన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. మళ్లీ భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కేంద్రం, రాష్ట్రాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కాగా.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 7కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న ద‌ృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని.. స్వదేశీ వ్యాక్సిన్ ఎగుమతిని నిషేధించిందటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. ఇత‌ర దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్ల ఎగుమ‌తిపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టంచేసింది. ఈ మేర‌కు విదేశాంగ‌శాఖ అధికార‌ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఇప్పటివరకు 80కి పైగా దేశాలకు వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేశామ‌ని పేర్కొన్నారు.

అయితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న దృష్ట్యా.. దేశీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగా.. కోవిడ్ వ్యాక్సిన్ల‌ డిమాండ్‌ను తీర్చేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ఎగుమతిని కేంద్రం నిరవధికంగా నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వ‌చ్చాయి. దీనిపై అరిందమ్ బాగ్చి శుక్రవారం స్పందించారు. దేశవ్యాప్తంగా దశలవారీగా వ్యాక్సిన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భ‌విష్య‌త్‌లో భారత్ తన భాగస్వామ్య దేశాలకు టీకాను సరఫరా చేస్తుందని ఆయన స్పష్టంచేశారు.

ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని పేర్కొన్నారు. అయితే ఎగుమతిపై నిషేధం అన్న వార్తలను అప్పుడే ప్ర‌భుత్వ‌ వర్గాలు ఖండించగా.. తాజాగా మరోసారి విదేశాంగ‌శాఖ స్పష్టతనిచ్చింది. కాగా.. జనవరి 20 నుంచి భారత్ విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తోంది. ఇప్పటివరకు 84 దేశాలకు 64 మిలియన్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఇటీవ‌ల‌ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:

Covid-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాపై అనుమానాలు.. గడ్డ కడుతున్న రక్తం.. బ్రిటన్‌లో వెలుగులోకి మరో 25 కేసులు