US Capitol: యూఎస్ క్యాపిటల్‌ భవనం వద్ద మళ్లీ అలజడి.. బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఓ అధికారి మృతి

United States Capitol complex: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అలజడి నెలకొంది. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్దనున్న బారికేడ్లపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో

US Capitol: యూఎస్ క్యాపిటల్‌ భవనం వద్ద మళ్లీ అలజడి.. బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఓ అధికారి మృతి
United States Capitol Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 03, 2021 | 5:20 AM

United States Capitol complex: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అలజడి నెలకొంది. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్దనున్న బారికేడ్లపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్టుండి ఓ కారు పోలీసులపైకి దూసుకువచ్చిందని కాపిటల్ పోలీస్ యాక్టింగ్ చీఫ్ యోగానంద పిట్మాన్ మీడియాతో పేర్కొన్నారు. ఆ వెంటనే డ్రైవర్ కత్తితో దిగుతుండగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

గాయపడిన ఓ పోలీసుతో పాటు నిందితుడిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే.. నిందితుడు చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు. వెంటనే యూఎస్ క్యాపిటల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ భద్రతను మోహరించారు. దారులన్నింటినీ మూసివేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేదీ వివరాలు సేకరిస్తున్నామన్నారు. అయితే శుక్రవారం ఈస్టర్ రోజున ఈ దాడి జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో.. బైడెన్‌కు పగ్గాలు చేపట్టేముందు కాపిటల్ భవనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఓ పోలీసు అధికారితో సహా నలుగురు మరణించారు. బైడెన్ ఎన్నికను సవాలు చేస్తూ.. జనవరి 6న వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు కాపిటల్ భవనంలో హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు సైతం జరిపారు.

Also Read:

Covid-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాపై అనుమానాలు.. గడ్డ కడుతున్న రక్తం.. బ్రిటన్‌లో వెలుగులోకి మరో 25 కేసులు

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే