Covid-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాపై అనుమానాలు.. గడ్డ కడుతున్న రక్తం.. బ్రిటన్‌లో వెలుగులోకి మరో 25 కేసులు

AstraZeneca-Oxford vaccine: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే.. పలు దేశాలు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికి బ్లడ్ క్లాట్స్,

Covid-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాపై అనుమానాలు.. గడ్డ కడుతున్న రక్తం.. బ్రిటన్‌లో వెలుగులోకి మరో 25 కేసులు
Astrazeneca Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2021 | 11:58 PM

AstraZeneca-Oxford vaccine: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే.. పలు దేశాలు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికి బ్లడ్ క్లాట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ పలు దేశాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలోనే బ్రిటన్‌లో ఇలాంటి కేసులు మరో 25 వెలుగులోకి రావడంతో.. ఈ టీకా సామర్థ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా 25 మందికి రక్తం గడ్డం కట్టిందని యూకే ఆరోగ్య విభాగం వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని బ్రిటన్‌లో రక్తం గడ్డకట్టిన కేసుల సంఖ్య 30కి పెరిగినట్లు మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ వెల్లడించింది.

అయితే.. ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ప్రయోజనాలు మాత్రం కరోనా ముప్పును అధిగమించేలా చేస్తాయని ఏజెన్సీ వెల్లడించింది. యూరప్‌లోని మరికొన్ని దేశాల్లోనూ ఇలాంటి కేసులే పెద్ద ఎత్తున వెలుగు చూడడంతో ఆస్ట్రాజెనెకా టీకాపై ఆయా దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి. అయినప్పటికీ.. కొన్ని దేశాలు ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నాయి.

ఇదిలాఉంటే.. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై వస్తున్న ఆరోపణలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొట్టిపడేసింది. టీకా సమర్థవంతంగా పనిచేస్తుందంటూ వెల్లడించింది. అయితే.. బ్రిటన్ వ్యాప్తంగా మార్చి 24 నాటికి 18.1 మిలియన్ డోసులు ఇవ్వగా రక్తం గడ్డకట్టిన కేసులు 30 వెలుగు చూశాయి. కాగా.. ఫైజర్, బయోఎన్‌టెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో మాత్రం ఇలాంటి కేసులు ఇప్పటివరకు వెలుగు చూడలేదు.

Also Read:

Corona vaccine: కరోనా కట్టడికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సరైనదే.. అమెరికాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..?

Vaccination In UK: బ్రిటన్‌లో నెమ్మదించనున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. భారత్‌ వ్యాక్సిన్ ఎగుమతిని తగ్గించడమే కారణం..