- Telugu News Photo Gallery World photos Taiwan train accident train derailed in a tunnel line 48 died few injured
Taiwan Train accident: తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన ఫ్యాసింజర్ ట్రైన్.. 51 మంది మృతి
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ సొరంగ మార్గంలో రైలు పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Updated on: Apr 02, 2021 | 10:17 PM

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 51 మంది ప్రాణాలను కోల్పోయారు.

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ సొరంగ మార్గంలో రైలు పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో 51 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వంద మందికి పైగా గాయాలు అయినట్లు తెలిపింది.

తైవాన్‌లోని తైపీ నుంచి టైటాంగ్ వెళ్తుండగా.. హోలియన్ కౌంటీ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రైలులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రైల్వే మెయింటెనెన్స్ ట్రక్ ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో.. ఓ ట్రక్కును ఢీకొట్టి రైలు పట్టాలు తప్పింది.

సొరంగ మార్గానికి కొంత దూరంలో ట్రక్‌ను వేగంగా ఢీకొట్టి.. అనంతరం సొరంగంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు బోగీలు తునాతునకలయ్యాయి. ప్రయాణికుల మృతదేహాలు చెల్లా చెదరుగా పడిపోయాయి.

ఘటనా స్థలంలో రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముక్కలు ముక్కలైన బోగీల్లో క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాలను క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి ఆస్పత్రులకు తరలించారు.

తైవాన్‌లో ఇటీవల జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం ఇదే కావడం విశేషం. ప్రమాద సమయంలో రైలు పూర్తిగా నిండిపోయిందని.. జనాలు కిక్కిరిసి ఉన్నారని స్థానికులు తెలిపారు.

గాయపడడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు.
