Corona vaccine: కరోనా కట్టడికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సరైనదే.. అమెరికాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..?
Oxford-AstraZeneca vaccine: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కలిసి సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఇప్పటికే నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనకా టీకాతో బ్లడ్ క్లాట్స్, సైడ్ ఎఫెక్ట్స్
Oxford-AstraZeneca vaccine: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కలిసి సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఇప్పటికే నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనెకా టీకాతో బ్లడ్ క్లాట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ పలు దేశాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టీకా సామర్థ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ అమెరికా ఆరోగ్య విభాగం డేటాను ప్రచురించింది. కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 79% ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. దీంతో వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయిట్లు పలువురు పేర్కొంటున్నారు.
దీంతోపాటు ఔషధ తయారీ కంపెనీ.. సోమవారం ట్రయల్స్ డేటాను సైతం ప్రకటించింది. 30,000 మందికి పైగా వాలంటీర్లకు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించినట్లు వెల్లడించింది. గతేడాది సరిగ్గా ట్రయల్స్ నిర్వహణ జరగలేదని.. ప్రస్తుతం జరిపిన ట్రయల్స్‌లో వృద్ధులకు కూడా టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. టీకా ట్రయల్స్‌లో ఒక వంతు వృద్ధులకు కూడా నిర్వహించామని యూకే డ్రగ్ కంపెనీ పేర్కొంది. ఈ వ్యాక్సిన్.. తీవ్రమైన వ్యాధిని.. మరణాలను నివారించడంలో 100% ప్రభావవంతంగా పనిచేస్తుందని యూకే వెల్లడించింది.
సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో.. ఆస్ట్రా జెనెకా టీకాను అనేక దేశాలు తత్కాలికంగా నిషేధించాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్, యూఎస్ ప్రకటనలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. యూరప్‌లోని అనేక దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో యూకే, యూఎస్ డేటాలతో ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ సమర్థతపై విశ్వాసం పెరుగుతుందని పలువురు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే టీకా వల్ల రక్తం గడ్డకడుతుందని పరీక్షల్లో ఎక్కడా తేలలేదని యూకే ఇప్పటికే స్పష్టంచేసింది. అయితే..ఏ కారణంతో ఈ సమస్య తలెత్తిందో తెలుసుకునేందుకు అనేక దేశాలు అధ్యయనాలు సైతం చేస్తున్నాయి.
Also Read: