74-year-old Canadian Grandma: ఆమె వయస్సు 74 సంవత్సరాలు.. ఈ విషయం చెబితే ఎవరైనా నమ్మగలరా…?

వృద్ధాప్యం మనిషి నుంచి అన్నీ లాగేసుకుంటుంది. ఏదైనా పనులు చేయాలంటే శరీరం సహకరించదు. వృద్ధాప్యంలో మనిషిలో యాక్టీవ్‌నెస్ ఉండదు...

74-year-old Canadian Grandma: ఆమె వయస్సు 74 సంవత్సరాలు.. ఈ విషయం చెబితే ఎవరైనా నమ్మగలరా...?
Grandma Fitness
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 22, 2021 | 4:09 PM

వృద్ధాప్యం మనిషి నుంచి అన్నీ లాగేసుకుంటుంది. ఏదైనా పనులు చేయాలంటే శరీరం సహకరించదు. వృద్ధాప్యంలో మనిషిలో యాక్టీవ్‌నెస్ ఉండదు. ముఖంపై ముడతలు కనిపించడం షరామాములే. తలపై జుట్టు ఊడిపోవడం, నోటి దంతాలు కూడా బలహీనమవ్వడం, ఊడిపోవడం సాధారణంగా జరిగేదే. వయసు మరింత మీదపెడితే నడవాలంటే కర్ర అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరికీ అదే జరుగుతుందా? అంటే కానే కాదు.

వృద్ధాప్యం నిర్వచనాన్ని ఈ కెనడా చెందిన పూర్తిగా తప్పని నిరూపిస్తుంది. మనసులో పాటు వయసు కూడా ఎప్పుడూ యవ్వనంగా ఉండటం సాధ్యమని చేతలతో చెబుతుంది. కెనడాలోని అంటారియోకు చెందిన ఈ  బామ్మ వయస్సు 74 సంవత్సరాలు. ఫోటోలు, వీడియోలు చూశాక అంత వయస్సు అంటే ఎవరైనా నమ్ముతారా. జోన్ అనే ఈ బామ్మ ఈ జీవనశైలి వెనుక ఆమె కుమార్తె ప్రొద్భలం వెనుక ఉందట. తనని తాను మార్చుకోవడంలో కూతురు చాలా సహాయపడిందట. బామ్మ తనను తాను ఆరోగ్యంగా ఉంచడానికి యోగాతో పాటు వెయిట్ లిఫ్టింగ్ చేయడం ప్రారంభించింది.

ప్రారంభ రోజుల్లో, ఆమె 5 కిలోల బరువును ఎత్తడానికి కూడా ఇబ్బందిపడేది. పట్టువిడవకుండా ప్రాక్టీస్ చేయడంతో ఆమె ఇప్పుడు ఎక్కువ బరువులను కూడా సులభంగా ఎత్తగలుగుతుంది. ఆమె వ్యాయామం,  ఫిట్ బాడీని చూసిన ప్రతి ఒక్కరూ  వయస్సును అస్సలు గుర్తించలేకపోతున్నారు. గత మూడేళ్లలో జోన్ 28 కిలోల బరువు తగ్గారట. ఆమె ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తారు. అందులో ఆమె 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మూడేళ్ల క్రితం తాను ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నాలు ప్రారంభించానని, అంతకు ముందు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు  చాలా మందులు వాడేదాన్నని ఆమె పేర్కొన్నారు. ఆమె తన జీవనశైలిని మార్చుకోకపోతే, మందులతో కాలం కొనసాగించాల్సిందేనని డాక్టర్స్ స్పష్టంగా చెప్పారట. దీంతో మందులను వీడేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారు.

Also Read:మహిళల మూత్రంతో బ్రెడ్ తయారీ.. ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..