AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Painting Pig: కుంచె పట్టి చిత్రాలు గీస్తోన్న పంది.. వైరల్‌గా మారిన వీడియోలు.. లక్షలు పలుకుతోన్న పెయింటింగ్స్‌..

Pigacasso The Painting Pig: ఇంటర్నెట్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే తెలిసిపోతోంది. మరీ ముఖ్యంగా వైరల్‌ వీడియోలు, వార్తలు క్షణాల్లో సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే..

Painting Pig: కుంచె పట్టి చిత్రాలు గీస్తోన్న పంది.. వైరల్‌గా మారిన వీడియోలు.. లక్షలు పలుకుతోన్న పెయింటింగ్స్‌..
Painting Pig
Narender Vaitla
|

Updated on: Mar 22, 2021 | 12:24 PM

Share

Pigacasso The Painting Pig: ఇంటర్నెట్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే తెలిసిపోతోంది. మరీ ముఖ్యంగా వైరల్‌ వీడియోలు, వార్తలు క్షణాల్లో సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో హల్చల్‌ చేస్తోంది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్‌ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్‌ అనే ఓ మహిళా స్థానికంగా ఫామ్‌ శాంక్చ్యూరీని నిర్వహిస్తోంది. లెఫ్సాన్‌కు 2016లో జంతువధశాలలో ఓ వరాహం కనిపించింది. దీంతో ఆ వరాహాన్ని అక్కడి నుంచి రక్షించిన లెఫ్సాన్‌ తన శాంక్య్చూరీకి తీసుకెళ్లింది. అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆ వరాహంలోని ప్రతిభను గుర్తించిన లెఫ్సాన్‌ దానితో చిత్రాలు వేయించడం ప్రారంభించింది. వరాహం కూడా నోటితో కుంచెను పట్టుకొని బొమ్మలు గీయం మొదలు పెట్టేసింది. దీంతో ఆ పంది గీస్తోన్న చిత్రాలను లెఫ్సాన్‌ నెట్టింట్లో పోస్ట్‌ చేయడం మొదలు పెట్టింది. ఆ పందికి ‘పిగాసో’ అని పేరు పెట్టి.. ఆ పేరు మీదే సోషల్‌ మీడియా సైట్లలో అకౌంట్లను ఓపెన్‌ చేసింది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా పిగాసో గీసిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్‌గా మారాయి. ఇక పిగాసోకు కలర్స్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్స్ట్‌ కలగకుండా లెఫ్సాన్‌ సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం. ఇక పిగాసో గీసిన చిత్రాలు కేవలం వైరల్‌గా మారడానికే పరిమితం కాకుండా ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాలను వేలం పాట వేయడం ప్రారంభించారు. దీంతో పిగాసో ఇప్పటి వరకు గీసిన బొమ్మలను అమ్మడం ద్వారా ఏకంగా రూ.2,89,768 రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని జంతు సక్షేమ నిధికి ఉపయోగిస్తోంది లెఫ్సాన్‌. మరి చిత్రకారుడిగా మారిన ఈ వారాహం గీసిన బొమ్మలపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Apple iPhone 12: ఐఫోన్‌తో ఛార్జర్ ఇవ్వకపోవడంతో ఆపిల్ సంస్థకు భారీ జరిమానా.. ఎంత వేశారంటే.!

ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

భూమిపై మారణహోమం తప్పదా.. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం? అసలు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు