SBI Credit Card: క్రెడిట్ కార్డు బిల్లును ఈఎమ్‌ఐగా మార్చుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
SBI Credit Card EMI: ఇటీవల క్రెడిక్ కార్డు వినియోగం బాగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్‌లు అందుబాటులోకిరావడం, అందులోనూ పలు వ్యాపార సంస్థలు క్రెడిట్ కార్డులపై ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించడంతో చాలా మంది...
SBI Credit Card EMI: ఇటీవల క్రెడిక్ కార్డు వినియోగం బాగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్‌లు అందుబాటులోకిరావడం, అందులోనూ పలు వ్యాపార సంస్థలు క్రెడిట్ కార్డులపై ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించడంతో చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగంపై ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు లెక్కకు మించి కార్డు వినియోగం పెరిగిపోతోంది. అయితే భారంగా మారిన క్రెడిట్ కార్డు బిల్లును ఈఎమ్‌ఐగా మార్చుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? దాదాపు అన్ని బ్యాంకులు వినియోగదారుడికి ఈ అవకాశాన్ని అందించాయి. మరి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉపయోగించే వారు బిల్లును ఈఎమ్‌ఐగా మార్చుకోవడానికి ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి.
* ఇందుకోసం ముందుగా ఎస్‌బీఐ కార్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
* అనంతరం పేజీలో ఎడమవైపు పైన ఉన్న ‘బెన్‌ఫిట్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసిన తర్వాత ‘ఫెక్సీపే’పై క్లిక్ చేయాలి.
* వెంటనే మీరు ఇటీవల చేసిన ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిలో మీరు ఈఎమ్‌ఐగా మార్చుకోవాలనుకున్న ట్రాన్సాక్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో ఎంత వడ్డీ పడుతుంది వివరాలు వస్తాయి.
* అనంతరం ఈఎమ్‌ఐ ఎన్ని నెలలు ఎంచుకోవాలనుకుంటున్నారు సెలక్ట్‌చేసుకోవాలి. దీంతో ఈఎమ్‌ఐ ఎంత ఉంటుందో చూపిస్తుంది. అనంతరం షరతులకు అనుమతిస్తూ ఓకే చెప్పాలి.
* ఇదంతా పూర్తయ్యాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఈఎమ్‌ఐగా మార్చుకోవడానికి కనీసం రూ.2500 ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది.
మరో పద్ధతి..
ఇక ఈఎమ్‌ఐగా మార్చుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. ఇందుకోసం ముందుగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ‘FP’ అని టైప్ చేసి 56767 నెంబర్‌కు మెసేజ్ పంపించాలి. లేదా1860 180 1290 నెంబర్‌కు కాల్ చేయాలి. ఇక ఈఎమ్‌ఐ మార్చుకోవడానికి బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది.