వచ్చే నాలుగేళ్లలో అన్ని కంపెనీలలో ఉద్యోగులు రోబోలే.. మర మనుషుల వైపు మళ్లుతున్న కంపెనీలు..

Soon A1 - Based Robots : ఆధునిక ప్రపంచంలో మానవులు టెక్నాలజీ, యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒరాకిల్

వచ్చే నాలుగేళ్లలో అన్ని కంపెనీలలో ఉద్యోగులు రోబోలే..  మర మనుషుల వైపు మళ్లుతున్న కంపెనీలు..
A1 Based Robots
uppula Raju

|

Mar 22, 2021 | 12:31 PM

Soon A1 – Based Robots : ఆధునిక ప్రపంచంలో మానవులు టెక్నాలజీ, యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒరాకిల్ మనీ అండ్ మెషీన్స్: 2020 గ్లోబల్ స్టడీ ప్రకారం.. 14 దేశాలలో 9,000 మంది వినియోగదారులు, వ్యాపార నాయకులతో సర్వే నిర్వహించారు. ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో జపాన్, చైనా తర్వాత భారతదేశం ఒకటి. ఇక్కడ 83 శాతం మంది భారతీయులు, 88 శాతం మంది వ్యాపారులు ఫైనాన్స్ నిర్వహణకు మానవులకన్నా ఎక్కువగా కృత్రిమ మేధస్సు (AI) ను విశ్వసిస్తున్నారు.

ఆసియా-పసిఫిక్ అంతటా, 76 శాతం మంది వినియోగదారులు ఆర్థిక నిపుణుల కంటే రోబోలను ఎక్కువగా నమ్ముతున్నారని, ప్రపంచ స్థాయిలో ఇది 67 శాతం ఉందని వివరించారు. ఇక కోవిడ్ వల్ల 2020 లో ఇది రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఈ అధ్యయనం చెప్పేది ఏంటంటే.. మానవులపై నమ్మకం పోతుండటం, రోబోట్లు ఆ అంతరాన్ని పూరించడం మనం స్పష్టంగా చూడవచ్చు. రెండోది ఫైనాన్స్ బృందాలు, ఆర్థిక సలహాదారుల పాత్రపై దృక్పథం నెమ్మదిగా మారుతోందని అని గ్లోబల్ సాస్- గురు ప్రసాద్ గాంకర్ చెప్పారు.

కోవిడ్ ప్రభావం కారణంగా, 90 శాతం వ్యాపారులు ఉద్యోగులను భర్తీ చేస్తారని చెబుతున్నారు. వారిలో మూడోవంతు 2025 లోనే జరుగుతుందని అందరు అంటున్నారు. భారతదేశంలో, AI ని స్వీకరించడానికి అధిక ఉత్సాహం చూపుతున్నారు. 87 శాతం మంది వ్యాపారులు తమ ఆర్థిక ప్రక్రియలను పునరాలోచించకపోతే నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని నమ్ముతున్నారు. సర్వే ప్రకారం.. మోసాలను గుర్తించడం, ఇన్వాయిస్లు సృష్టించడం, ఖర్చు / ప్రయోజన విశ్లేషణ ద్వారా రోబోట్లు తమ పనిని మెరుగుపరుచుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

ముఖ్యంగా మోసాలను గుర్తించడం రోబోట్‌లకు మంచి పరిణామంగా మారిందన్నారు. AI ను స్వీకరించడానికి భారతదేశంలో ఉత్సాహం ఉందని గురు ఎత్తిచూపారు, ఇది ఒరాకిల్ తన రెండో డేటా సెంటర్‌ను దేశంలో హైదరాబాద్‌లో ప్రారంభించిందన్నారు. రోబోట్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రజలకు దగ్గరగా ఉన్న విషయాల విషయానికి వస్తే, వారు ఇప్పటికీ వ్యక్తిగత సలహాదారులనే ఇష్టపడతారన్నారు.

Anand Mahindra Shocked : అక్రమంగా మద్యం తరలించడానికి ట్రక్ డిజైన్ మార్చిన స్మగ్లర్స్.. ఆనంద్ మహీంద్రా షాక్

World Water Day 2021: నీటి పొదుపుపై స్ఫూర్తిదాయక ట్వీట్‌ చేసిన స్మితా సబర్వాల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu