బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. సేవింగ్స్‌ అకౌంట్‌ లిమిట్ ఎంతో తెలుసా.. ట్యాక్స్‌ పడకూడదంటే తెలుసుకోండి..

Bank Account Holders : మీరు బ్యాంక్ ఖాతాదారులా అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.. మీరు మీ సేవింగ్‌ అకౌంట్లో సంవత్సరానికి ఎంత మొత్తం పొదుపు చేయాలి.

బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. సేవింగ్స్‌ అకౌంట్‌ లిమిట్ ఎంతో తెలుసా.. ట్యాక్స్‌ పడకూడదంటే తెలుసుకోండి..
Bank Account Holders
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 23, 2021 | 11:53 AM

Bank Account Holders : మీరు బ్యాంక్ ఖాతాదారులా అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.. మీరు మీ సేవింగ్‌ అకౌంట్లో సంవత్సరానికి ఎంత మొత్తం పొదుపు చేయాలి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి వెసులుబాటు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాను మెయింటెన్ చేస్తున్నారు. అయితే చాలామంది వివిధ కారణాల వల్ల చాలా బ్యాంకుల్లో చాలా ఖాతాలు ఉంటున్నాయి. ఖాతాదారులు తమ డబ్బును నిల్వ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే సేవింగ్‌ అకౌంట్లో జమ చేయవలసిన మొత్తానికి పరిమితి లేనప్పటికీ.. ట్యాక్స్‌ వెసులుబాటు దొరకాలంటే ఎంత మొత్తం పొదుపు చేయాలో తెలుసుకోండి.. అంతేకాకుండా ఎంత మొత్తం విత్‌ డ్రా చేయాలో కూడా తెలుసుకోండి..

నల్లధనాన్ని అరికట్టడానికి, పన్ను బేస్ను విస్తృతం చేసే ప్రయత్నంలో లావాదేవీలు జరిగేటప్పుడు బ్యాంకులు, కార్పొరేట్లు, పోస్టాఫీసులు ఎన్బిఎఫ్సిలకు.. స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ (ఎస్ఎఫ్టి) ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది పొదుపు ఖాతాలో నిర్దేశించిన పరిమితిని మించిపోవడంతో ఈ నిబంధనలు జారీ చేసింది. ఇవి నగదు డిపాజిట్లు / ఉపసంహరణలు, షేర్లు / డిబెంచర్లు / టైమ్ డిపాజిట్లు / మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, విదేశీ మారకద్రవ్యం కొనుగోలు, స్థిరమైన ఆస్తిలో లావాదేవీలు మొదలైన వాటికి వర్తిస్తాయి.

బ్యాంకింగ్ కంపెనీలు టైం డిపాజిట్ ఖాతాలు కాకుండా, బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు మరియు ఉపసంహరణలను SFT లో భాగంగా పన్ను విభాగానికి సంవత్సరానికి క్రమం తప్పకుండా నివేదించాలి. అయితే ఖాతాదారుడు రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో మెయింటెన్ చేసేటప్పుడు ట్యాక్స్ కిందికి వస్తారు. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. రూ. 10లక్షలకు మించి ఖాతాదారులు లావాదేవీలు నిర్వహించకుండా ఉంటే ట్యాక్స్‌ నుంచి వెసులుబాటు దొరుకుతుంది. కరెంట్ ఖాతాల విషయంలో ఈ పరిమితి రూ .50 లక్షలు అంతకంటే ఎక్కువ. అయితే నగదు లావాదేవీలతో పాటు, మరికొన్ని లావాదేవీలు కూడా మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో ఆర్థిక సంవత్సరంలో రూ .10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేసినప్పుడు ట్యాక్స్ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.

Leopard Trapped: కుక్కను వెంటాడుతూ ఇంట్లోకి దూరిన చిరుత.. చివరికి ఏం జరిగింది అంటే.!

Apple iPhone 12: ఐఫోన్‌తో ఛార్జర్ ఇవ్వకపోవడంతో ఆపిల్ సంస్థకు భారీ జరిమానా.. ఎంత వేశారంటే.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?