భూమిపై మారణహోమం తప్పదా.. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం? అసలు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు
Nostradamus quatrains: ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో అతలాకుతలమైంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కోవిడ్-19 వైరస్‌తో అన్ని దేశాలు ఇప్పటికీ కోలుకోలేని విధంగా మారాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి కనిపించని వైరస్‌తో
Nostradamus quatrains – hird World War: ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో అతలాకుతలమైంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కోవిడ్-19 వైరస్‌తో అన్ని దేశాలు ఇప్పటికీ కోలుకోలేని విధంగా మారాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి కనిపించని వైరస్‌తో పోరాటం చేస్తున్నాయి. అయినా ముప్పు తొలిగిపోవడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన కోట్లాది మంది పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు చాలా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. అయినప్పటికీ.. పెరుగుతున్న కేసులతో కరోనా సెకండ్ వేవ్ సమస్య వెంటాడుతోంది. అయితే ప్రళయంలో ఇది ఆరంభం మాత్రమేనని.. ఇలాంటివి మరెన్నో సమస్యలు ఎదుర్కొవల్సి ఉంటుందని పలువురు ప్రపంచ జ్యోతిష్కులు వ్యాఖ్యానిస్తుండటం ఇప్పుడు పలు ఆందోళనలకు తావిస్తోంది.
విపత్తులు, కరోనా భయం వెంటాడుతున్న వేళ.. ఇది ప్రారంభం మాత్రమేనని.. భూమి చాలా విపత్తులను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఫ్రెంచ్ ప్రముఖుడు బాబీ షైలర్ పేర్కొంటున్నాడు. 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ ఊహించిన విధంగానే.. అలాంటి సంఘటనలే ప్రస్తుతం భూమిపై జరగుతున్నాయంటూ బాబీ షైలర్ తెలిపాడు. అప్పట్లోనే నోస్ట్రాడమస్.. భవిష్యత్తులో సంభవించే ఇలాంటి విపత్తులను ముందే ఊహించి చెప్పాడని.. అవన్నీ జరుగుతున్నాయంటూ షైలర్ తెలిపాడు.
ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ రచనలు, విశ్లేషణలతో షైలర్ డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందించాడు. నోస్ట్రాడమస్ చెప్పిన విధంగా భవిష్యత్తులో బ్రిటన్ వినాశకరమైన వరదలకు గురవుతుందని వెల్లడించాడు. దీంతోపాటు మూడవ ప్రపంచ యుద్ధం కూడా సంభవిస్తుందంటూ షైలర్ వ్యాఖ్యానించాడు. ఇది కనివినీ ఎరుగని మారణహోమానికి దారితీస్తుందన్నాడు. బహుశా ఇది ఈ శాతాబ్దంలోనే 10, 20 ఏళ్లల్లోనే సంభవించవచ్చని.. జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ పరిశోధనా విశ్లేషణతో చెబుతున్నట్లు షైలర్ పేర్కొన్నాడు. 1-2 ప్రపంచ యుద్ధాల కన్నా.. మూడవ ప్రపంచ యుద్ధం ఘోరంగా ఉంటుందని.. ఆ తర్వాత వెయ్యి సంవత్సరాల వరకు శాంతి నెలకొంటుందని ఆయన పేర్కొన్నాడు. బహుశా ఈ మూడవ ప్రపంచ యుద్ధం 25 నుంచి 29 సంవత్సరాల వరకూ సుదీర్ఘంగా కొనసాగుతుందని, ఆ తర్వాత చిన్న యుద్ధాలు కొనసాగుతాయని.. నోస్ట్రాడమస్ చెప్పినట్లు షైలర్ వివరించాడు.
కాగా.. కొన్ని నెలల క్రితం వార్షిక జాతకం 2021 అనే వెబ్‌సైట్.. నోస్ట్రాడమస్ రాసిన క్వాట్రెయిన్‌లను స్పష్టంగా విశ్లేషించింది.. భవిష్యత్తులో ప్రపంచం ఒక జోంబీ అపోకాలిప్స్‌ను చూస్తుందని వెల్లడించింది. అయితే వీటన్నింటినీ శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధామనేది జరగే అవకాశమే లేదని స్పష్టంచేస్తున్నారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలు యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఓ వైపు విపత్తులు మరోవైపు ఆర్థిక సంక్షోభాలు వెంటాడుతున్న ప్రస్తుత కాలంలో మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని.. అలాంటప్పుడు యుద్ధమనేది జరగదంటూ పేర్కొంటున్నారు.
Also Read: