Ram Naramaneni |
Updated on: Mar 21, 2021 | 9:01 PM
ఓ మహిళ.. టాయిలెట్ నుంచి మూత్రాన్ని సేకరించి తినే బ్రెడ్‌ల తయారీలో వినియోగిస్తుంది. ఇందుకు ఆమె ఓ ఇంట్రస్టింగ్ కారణం చెబుతున్నారు. గోమూత్రంలో పోషకాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు.
మహిళల మూత్రంలో కూడా పోషకాలు ఉంటాయని ఆమె చెప్పుకొస్తుంది. ఇంతకీ ఆమె పేరు లూయిస్ రాగెట్. తన ఇకో ఫేమినిస్ట్ కూడా. కాగా తయారుచేస్తోన్న బ్రెడ్‌లో పోషకాలు పెంచేందుకు మహిళల యూరిన్ వినియోగిస్తుంది.
వాటికి ‘గోల్డీలాక్స్ బ్రెడ్’ అని నామకరణం చేసింది. ఈ రొట్టెల తయారీ కోసం ఆమె రోజూ మహిళల టాయిలెట్ల నుంచి మూత్రాన్ని సేకరిస్తుంది. అనంతరం దాన్ని శుభ్రపరిచి బ్రెడ్ మీద స్ప్రే చేస్తోంది.
ఇది తలచుకుంటేనే చాలామందికి యాకలింపుగా ఉంటుంది.అయితే, దీని వెనుక ఉన్న సైన్స్ గురించి ఆమె చెబితే మీలో కూడా కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. యూరిన్‌లో నైట్రోజన్, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయట.
వీటిని ఎన్నో పరిశ్రమలు కష్టపడి భూమి నుంచి సేకరిస్తున్నాయట. ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ రీసెర్చ్ ప్రకారం.. 29 మిలియన్ల యూరిన్ బ్రెడ్ల తయారు చేయడం ద్వారా ప్రతి రోజు పరిశ్రమల్లో 703 టన్నుల నైట్రోజన్‌ను సేవ్ చేయొచ్చట. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని డాక్యుమెంట్లను సైతం తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.