భగభగ మండే జ్వాలా ద్వీపం ! ఎరుపెక్కిన లావాను వెదజల్లుతున్న అగ్నిపర్వతం, డ్రోన్ తీసిన దృశ్యం !
అగ్నిపర్వతాన్ని చూస్తేనే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటిది అది ఒక్కసారి బద్దలై మంటలను ఎగదోస్తూ.. ఎర్రని లావాను నీటి ప్రవాహంలా వెదజల్లుతుంటే ఆ సీన్ మరింత హారర్ !
అగ్నిపర్వతాన్ని చూస్తేనే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటిది అది ఒక్కసారి బద్దలై మంటలను ఎగదోస్తూ.. ఎర్రని లావాను నీటి ప్రవాహంలా వెదజల్లుతుంటే ఆ సీన్ మరింత హారర్ ! వేడిమి అయితే ఇక చెప్పనక్కర్లేదు.. ఐస్ ల్యాండ్ కు వెళ్తే అక్కడ నోరు తిరగని ఓ అగ్నిపర్వతం కనిపిస్తుంది. అదే ‘ఫగ్రాదాల్ ఫై జాల్ ‘ అనే వోల్కనో ! ఐస్ లాండ్ రాజధాని రీక్జవిక్ శివారుల్లో ఉంది ఇది.. ఇన్నేళ్లూ మండకుండా కామ్ గా ఉన్న ఈ పర్వతం ఒక్కసారిగా గత శుక్రవారం పేలిపోయింది. ఎర్రని లావాను విరజిమ్ముతూ భయంకర శబ్దం చేస్తూ పేలింది. జోర్న్ స్టెన్ బెక్ అనే వ్యక్తి తన డ్రోన్ ని దీనిపై ఎగురవేసినప్పుడు ఇది ఇలా కనిపించింది. ఈయన తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను అప్ లోడ్ చేసి వదిలాడు. ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశాడు. ఈ డ్రోన్ ఆకాశంలో ఎగురుతూ ఈ వోల్కనో విరజిమ్ముతున్న లావా తాలూకు దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఒక డ్రోన్ ఇంత సమీపంగా ఇలా బద్దలైన అగ్నిపర్వతం మీదుగా పోవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ! ఈ వీడియోకి లెక్కకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఐస్ లాండ్ లో ఎక్కడబడితే అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయట.. 32 ఉండవచ్చునని అంటున్నారు. ఇవన్నీ చురుకుగానే ఉన్నాయని కూడా తెలిపారు వాతావరణ పరిశోధకులు. అన్నట్టు ఈ వోల్కనో సుమారు 800 ఏళ్లుగా కామ్ గా ఉందని అంటున్నారు. అయితే ఇది బూడిదను వెదజల్లకపోవడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి: సెంటర్‌లో తారక రాముడు.. ఓవైపు సినిమా.. మరోవైపు రాజకీయం.. చిన్నోడి పయనం ఎలా సాగేను!