కెనడాలోని హోటల్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం ! చూడాల్సిందే !

కెనడాలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద భారత జాతిపిత గాంధీజీ ఐస్ విగ్రహం ఏర్పాటైంది. రానున్న ఆగస్టు 15 న ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోనుంది...

కెనడాలోని హోటల్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం ! చూడాల్సిందే !
Canada Hotel Installs Ice Sculpture Of Gandhi For India's 75th Independence Day
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 22, 2021 | 8:15 PM

కెనడాలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద భారత జాతిపిత గాంధీజీ ఐస్ విగ్రహం ఏర్పాటైంది. రానున్న ఆగస్టు 15 న ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోనుంది.  దీన్ని పురస్కరించుకుని క్యూబెక్ సిటీలోని ఈ హోటల్ ఆవరణలో ఏడు అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది పూర్తిగా ఐస్ తో తయారవడం  విశేషం. మార్క్ లీ పెయిర్ అనే ఐస్ ఆర్టిస్టు ఈ విగ్రహాన్ని రూపొందించాడు. టొరంటో లోని భారత దౌత్య కార్యాలయం ఈ విగ్రహ ఇమేజీని తమ అధికారిక ట్విటర్ లో షేర్ చేస్తూ లాంచింగ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ పేర్కొంది. ఈ  సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ గురించి వివరించింది.  75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర  ఉత్సవాల నేపథ్యంలో ప్రధాని మోదీ  మార్చి 12 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కెనడా  మన ఇండియాతో బాటు గాంధీజీకి గౌరవ పురస్కరంగా  ఈ విగ్రహాన్ని ఈ హోటల్ వద్ద ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: ISSF Shooting World Cup 2021: గురిపెడితే గెలుపు మనదే… ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో అదరగొట్టిన భారత షూటర్లు..

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై బాదుడు.. గత ఆరేళ్లల్లో ఎంతశాతం పన్నులు పెరిగాయో తెలుసా..?