ISSF Shooting World Cup 2021: గురిపెడితే గెలుపు మనదే… ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో అదరగొట్టిన భారత షూటర్లు..

ఐఎస్​ఎస్​ఎఫ్​ వరల్డ్​కప్​లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో భారత్​ మరో గోల్డ్​ మెడల్​ కైవసం చేసుకుంది.

ISSF Shooting World Cup 2021: గురిపెడితే గెలుపు మనదే... ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో అదరగొట్టిన భారత షూటర్లు..
Issf Shooting
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2021 | 8:09 PM

ISSF Shooting: ఐఎస్​ఎస్​ఎఫ్​ వరల్డ్​కప్​లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో భారత్​ మరో గోల్డ్​ మెడల్​ కైవసం చేసుకుంది.

ప్రపంచకప్​లోని 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్​ విభాగంలో భారత్​కు స్వర్ణం దక్కింది. ఎయిర్​ పిస్టల్ మిక్స్​డ్​​ విభాగంలో సౌరభ్​ చౌదరి, మనూ బాకర్​ జంట స్వర్ణం గెలుపొందింది.

ఇరాన్​ జంట గోల్నౌష్ సెభతోల్లాహి-జావెద్ ఫోరోగిపై భారత్ జోడీ విజయం సాధించింది. ఈ పతకంతో ప్రస్తుత వరల్డ్​కప్​లో భారత్​ పొందిన మొత్తం గోల్డ్​ మెడళ్ల సంఖ్య ఐదుకు చేరింది.

అయితే… ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో మను బాకర్, యశస్విని దీస్వాల్, శ్రీ నివేదాలతో కూడిన మహిళల బృందం స్వర్ణం నెగ్గింది. అలాగే పురుషుల విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, షాజార్​లతో కూడిన బృందం గోల్డ్‌ను దక్కించుకున్నారు. అలాగే మహిళల స్కీట్‌లో భారత యువ షూటర్‌ గనీమత్‌ సెకో కాంస్యం గెలుచుకుంది.

ప్రపంచకప్‌ షూటింగ్‌ మహిళల స్కీట్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షూటర్‌గా గనీమత్‌ సెకో రికార్డు సృష్టించింది. ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ జూనియర్‌ విభాగం 2018 లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌ కూడా గనీమత్‌ సెకోనే. స్కీట్‌ ఫైనల్లో గనీమత్‌ 40 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కార్తీకీసింగ్‌ (32) నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్‌లో గుర్‌జ్యోత్‌ 17 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చదవండి:  TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

Alert ! LIC: ఎల్ఐసీ ఖాతాదారులకు ముఖ్య సూచన..ఈ ఫారం నింపకపోతే మీ డబ్బులు ఇరుక్కుపోతాయి..