పిడుగుపాటుకు గురై పాపులర్ సర్ఫర్ కేథరిన్ డయాజ్ మృతి, విషాదంలో క్రీడాలోకం
ప్రపంచ ప్రఖ్యాత సర్ఫర్ 22 ఏళ్ళ కేథరిన్ డయాజ్ పిడుగుపాటుకు గురై మరణించింది. అంతర్జాతీయ సర్ఫింగ్ అసోసియేషన్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ తీవ్ర సంతాపం తెలిపింది. ఎల్ సాల్వడార్ లో ఈమె శిక్షణ తీసుకుంటుండగా...
ప్రపంచ ప్రఖ్యాత సర్ఫర్ 22 ఏళ్ళ కేథరిన్ డయాజ్ పిడుగుపాటుకు గురై మరణించింది. అంతర్జాతీయ సర్ఫింగ్ అసోసియేషన్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ తీవ్ర సంతాపం తెలిపింది. ఎల్ సాల్వడార్ లో ఈమె శిక్షణ తీసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురైంది. స్పోర్ట్స్ కి గ్లోబల్ అంబాసిడర్ గా ఉన్న కేథరిన్ పలు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లోనూ, ఐఎస్ఎ వరల్డ్ సర్ఫింగ్ గేమ్స్, ఐఎస్ఎ వరల్డ్ జూనియర్ సర్ఫింగ్ చాంపియన్ షిప్ లలోనూ పాల్గొందని ఈ సంస్థ వెల్లడించింది. వరల్డ్ సర్ఫ్ గేమ్స్ కోసం కేథరిన్ ప్రిపేర్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. టోక్యోలో జరిగే ఒలంపిక్స్ లో పాల్గొనాలంటే ఇందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పిడుగుపాటు కారణంగా తీవ్రంగా గాయపడిన ఈమెకు బీచ్ లోనే సపర్యలు చేసి..రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అంతర్జాతీయ సర్ఫింగ్ సంస్థ విచారం వ్యక్తం చేసింది.
నిజానికి అప్పుడు ఆకాశం నిర్మలంగా ఉందని, వాతావరణం కూడా సవ్యంగా ఉండి ఎలాంటి తుఫాను సూచనలు కనబడ లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. అనుకోకుండా ఈ ఉత్పాతం సంభవించిందని స్పానిష్ డైలీ కూడా తెలిపింది. ఎల్ సాల్వడార్ లో క్రీడాభిమానులంతా కేథరిన్ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువ సర్ఫర్ ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో క్రీడా లోకం దిగ్భ్రాంతిని ప్రకటించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.