దక్షిణ బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోహింగ్యా శిబిరంలో మంటలు.. వేలాది మంది నిరాశ్రయులు
దక్షిణ బంగ్లాదేశ్‌లో రోహింగ్యా ప్రవాస శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం. ఈ దుర్ఘటనలో అనేకమంది మృత్యువాతపడగా, వందలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు.
Bangladesh fire accident: దక్షిణ బంగ్లాదేశ్‌లో రోహింగ్యా ప్రవాస శిబిరంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో అనేకమంది మృత్యువాతపడగా, వందలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు. ఇటీవల కాలంలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇది అతి పెద్దదని స్థానిక అధికారులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లోని బలూఖాలిలో వందలాది మంది రోహింగ్యాలు శిబిరాలను ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నారు. ఒక ఇంట్లో చెలరేగిన మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకుని శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ శిబిరాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు, వందలాది మంది నిరాశ్రయులయ్యారని స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన వివరాలను అధికారులు గానీ, యూఎన్‌వో గానీ వెల్లడించలేకపోయారు.
HAPPENING NOW: massive fire in Balukhali Camp 1 #Rohingya #refugee camp pic.twitter.com/P0honDOWYM
— Shafiur Rahman (@shafiur) March 22, 2021
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ భారీ నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రతినిధి లూయిస్ డోనోవన్ తెలిపారు.
దక్షిణ బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా నాలుగు లక్షల మంది రోహింగ్యా తెగ ప్రజలు నివాసముంటున్నారు. 2017లో మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన మెజారిటీ ప్రజలు బంగ్లాదేశ్ చేరుకున్నారు. అయితే, వీరందరికీ ఆశ్రయం కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. రోహింగ్యాలు తలదాచుకుంటున్న తాత్కాలిక శిబిరాల్లో వసతులు కల్పించడంలో ఆ దేశ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న వార్తలు వెలువడ్డాయి.
Read Also… US President Joe Biden: అమెరికాలో పెట్రోల్, డీజిల్ కార్లకు మంగళం.. డెట్‌లైన్ ఇచ్చేసిన జో బైడెన్