యూఎస్ సూపర్ మార్కెట్ కాల్పుల ఘటనలో షూటర్ అరెస్ట్, జాతి వివక్షే కారణమా ?
US Supermarket shooting: అమెరికాలోని కొలరాడోలో గల కింగ్ సూపర్ మార్కెట్ లో ఓ షూటర్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఓ సీనియర్ పోలీసు అధికారి కూడా ఉన్నారు.
US Supermarket shooting: అమెరికాలోని కొలరాడోలో గల కింగ్ సూపర్ మార్కెట్ లో ఓ షూటర్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఓ సీనియర్ పోలీసు అధికారి కూడా ఉన్నారు. కాల్పుల అనంతరం కాళ్ళంతా రక్తమోడుతున్న ఓ వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు తీసుకుపోయారు. అతడిని అరెస్టు చేశామని, ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో అతని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వారు చెప్పారు. ఇతని నుంచి ఏ ఆర్ -15 రైఫిల్ ని స్వాధీనం చేసుకున్నారు. జార్జియాలోని అట్లాంటాలో కాల్పులు జరిగి వారం రోజులైనా గడవక ముందే కొలరాడోలో ఈ నెత్తురోడిన సంఘటన జరిగింది. షూటర్ ని ఎదుర్కోబోయిన ఓ సీనియర్ పోలీసు అధికారి కూడా అతని కాల్పుల్లో మరణించడం పోలీసు శాఖకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో సూపర్ మార్కెట్ లోని వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరిని పోలీసులు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కాగా జాతి వివక్షే ఈ ఘటనకు కారణమా లేక మరేదైనా అన్నది తెలియలేదు.
దేశంలో వర్ణ వివక్షకు అంతం పలకాల్సి ఉందని, ఇందుకు ఏదో ఒక చర్య తీసుకుంటామని అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే ప్రకటించారు. అయితే దేశంలో గన్ కల్చర్ సాగుతున్నంత కాలం ఈ ప్రకటనలన్నీ వట్టి ఆర్భాటపు మాటలుగానే నిలిచిపోనున్నాయి. లోగడ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దేశంలో ఈ విధమైన హింసాత్మక గన్ కల్చర్ కి స్వస్తి చెబుతామని చాలాసార్లు ప్రకటించారు. కానీ ఈ విష సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక -కొలరాడో ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.