Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవదహనం

కొందరు నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కొందరు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు వారికి..

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవదహనం
Car Fires
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2021 | 8:53 AM

కొందరు నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కొందరు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ముగ్గుర సజీవదహనమైన ఘటన విషాదంగా మారింది. పోలీసుల వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, ఓ కారు డ్రైవర్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారు నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. అయితే వానాల తనిఖీలో భాగంగా పోలీసులు వెంటపడుతున్నారని, వారికి దొరక్కుండా తప్పించుకునేందుకు అతి వేగంగా వెళ్లడంతో కారు బోల్తా పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిపోతుండటంతో పోలీసులు సైతం తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో పోలీసులు కూడా వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. పోలీసులను భయపడి కొందరు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్య కారణాల వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు పోలీసులు చేస్తున్న తనిఖీల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే వాహనదారులు వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు దగ్గర ఉంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగవు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ చదవండి:

US Supermarket Shooting: అమెరికాలో రెచ్చిపోయిన దుండగులు.. సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు.. 10 మంది మృతి

Ration Card: ఒకే రేషన్‌ కార్డులో 68 మంది సభ్యులు.. 38 క్వింటాళ్ల ధాన్యం వచ్చినట్లు గుర్తింపు.. డీలర్‌పై కేసు నమోదు

No insurance: అతిగా మద్యం తాగి మరణించిన వారికి ఇన్సూరెన్స్‌ రాదు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..